బిగ్ సీజన్ 8 సీజన్ బుధవారం రసవత్తరంగా సాగిందనే చెప్పొచ్చు. బుధవారం ఎపిసోడ్లో బిగ్ బాస్.. చీఫ్‌లకి హౌస్‌లో ఏర్పాటు చేసిన సూపర్ బజార్ నుంచి రేషన్ తెచ్చుకునే అవకాశమిచ్చాడు. యష్మీ టీమ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండటంతో బిగ్ బాస్ ఆమెకు ఎక్కువ టైం ఇచ్చాడు . అయితే ముగ్గురు చీఫ్ రేషన్‌ను వాళ్లు ఉపయోగించుకోవాలంటే టాస్క్ లు గెలవాలని చిన్న మెలిక పెట్టాడు.
ముందుగా వీరికి బిగ్ బాస్ లెమన్ పిజ్జా టాస్కు ఇవ్వగా.. ఈ టాస్క్ లో యష్మి టీమ్ గెలిచింది. ఆతర్వాత కనిపెట్టు పరిగెత్తు అనే టాస్క్ ఇవ్వగా.. దానిలో నైనికా టీమ్ విన్ అయ్యింది. అయితే ఇచ్చిన రెండు టాస్క్ ల్లోనూ ఓడిపోయిన నిఖిల్ టీమ్ కు మాత్రం బిగ్ బాస్ రాగి పిండి ఒక్కటే ఇచ్చాడు . దానినే వారం రోజులు సరిపెట్టుకోవాలని చెప్పాడు.
అయితే మొదటి టాస్క్‌లో తన టీమ్ గెలిచిన తర్వాత సోనియా ఏడవడం మొదలుపెట్టింది.వెంటనే అభయ్ సోనియా దగ్గరికి వెళ్లి ఓదార్చాడు. ఆతర్వాత నిఖిల్ సోనియా దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఓదార్చాడు. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ అభయ్.. నిఖిల్ ను పక్కకి పంపి మరీ ఓదార్చాడు. ఆతర్వాత వచ్చిన పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. అయితే ఇన్నాళ్లు అందరం కలిసి తిన్నామ్.. ఇప్పుడు రేషన్స్ సపరేట్ అవ్వడంతో ఒకరు తింటుంటే మరొకరు చూస్తూ ఉండాలి కాబట్టి అది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతూ తన ఏడ్వడానికి రీజన్ చెప్పింది సోనియా.
అదే రోజు రాత్రి సమయంలో సోనియా, నిఖిల్ డిస్కషన్ పెట్టగా.. తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నానా అని ఆలోచిస్తున్నా అంటూ సోనియా అంది. దానికి దేని గురించి మాట్లాడుతున్నావ్ సోనియా అని నిఖిల్ అంటే.. నువ్వు ఇలా బిహేవ్ చేయడం వాళ్లకు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని సోనియా జవాబిస్తుంది. దానికి నిఖిల్ తన వల్ల సోనియాకు ఏమైనా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని సోనియా అనుకుంటే తనకు ఏది కరెక్ట్.. మంచిది అనిపిస్తే అది చెయమని..తనను వదిలేయమని అంటాడు. ఇక తనతో మాట్లాడొద్దని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. దానికి సోనియా థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత యష్మికి , నిఖిల్ కు మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత నైనికా దగ్గర తన గురించి చెప్పుకుంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు .” తాను మనిషిలా ఉందామనుకుంటున్నానని.. చాలా యంగ్ ఏజ్ నుంచే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నానని చెబుతాడు. అది కూడా తనకు చాలా ఇష్టం అని చెబుతాడు. కానీ ఆ జర్నీలో తనను తాను కోల్పోయానంటూ ఎమోషనల్ అవుతాడు. కొన్ని సార్లు కొన్ని విషయాలు చాలా అన్ ఫెయిర్ అనిపిస్తాయి కదా నాన్న అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకుని ఆడియన్స్ మనసును కూడా కాస్త ఎమోషనల్ కు గురి చేస్తాడు.