అంబానీ వారసులకు జీతాలే ఉండవు

Ambanis successors have no salaries,Ambanis successors,successors have no salaries,Ambani no salaries,Mango News,Mango News Telugu,Reliance Industries,Mukesh Ambani,Akash Ambani, Isha Ambani, Anant Ambani, Ambani succession plan,AGM, Board Members,Ambanis successors have no salaries,Ambanis successors Latest News,Ambanis successors Latest Updates,Ambanis successors Live News,Ambani Latest News,Ambani Live Updates

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ వారసులయిన ఆకాశ్ అంబానీ , ఈశా అంబానీ , అనంత్‌ అంబానీ ఈ మధ్యనే రిలయన్స్‌ బోర్డులోకి వచ్చారు. అయితే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా వీరంతా నియమితులవడంతో.. వీరికి ఎలాంటి జీతాలు ఉండవట. కేవలం బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రమే చెల్లించనున్నారు. ఈ విషయాలను షేర్ల హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించడంతో అంబానీ వారసుల వేతనాల విషయం వెలుగులోకి వచ్చింది.

తన వారసత్వ ప్రణాళికలో భాగంగా ముకేశ్ అంబానీ తన ముగ్గురు పిల్లలకు గతేడాది కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ సంవత్సరం వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. గత నెల జరిగిన రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశంలో ఈశా అంబానీ, అనంత్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ ముకేశ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరంతా నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలోనే వ్యవహరించనున్నారు. వీరి నియామకాన్ని ఆమోదించడం కోసం కంపెనీ రీసెంట్‌గా షేర్‌ హోల్డర్లకు రిజల్యూషన్‌ పంపింది.

ఈశా అంబానీ, అనంత్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీలు కేవలం సిట్టింగ్‌ ఫీజులు, కంపెనీ నమోదు చేసిన లాభాల్లో కమిషన్‌ మాత్రమే పొందుతారని కంపెనీ రిజల్యూషన్‌‌లో వెల్లడించింది. గతంలో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రిలయన్స్‌ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే నీతా అంబానీ కూడా జీతం లేకుండానే కేవలం సిట్టింగ్‌ ఫీజుతో పాటు కమిషన్‌ పొందినట్లు కంపెనీ తమ వార్షిక నివేదికలో పేర్కొంది.

మరోవైపు వారసత్వ ప్రణాళికను ప్రకటించినా కూడా..మరో ఐదేళ్ల పాటు తానే ఛైర్మన్‌గా కొనసాగనున్నట్లు ముకేశ్ అంబానీ అప్పుడే ప్రకటించారు.అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన ఎలాంటి వార్షిక వేతనం కానీ, లాభం ఆధారిత కమిషన్‌ను కానీ తీసుకోవట్లేదు. మరో ఐదేళ్ల పాటు కూడా తనకు ఎలాంటి వేతనం వద్దని ఇప్పటికే ముకేశ్ కంపెనీ బోర్డుకు చెప్పేశారు.అయితే అంతకుముందు కూడా 2008-09 నుంచి 2019-20 వరకు ముకేశ్ తన వార్షిక వేతనాన్ని కేవలం రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.

వారసత్వ ప్రణాళికలో భాగంగా.. ఆకాశ్‌ అంబానీ గత సంవత్సరం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బాధ్యతల్ని స్వీకరించారు. అలాగే ఈశా అంబానీ రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతల్ని తీసుకోగా.. అనంత్‌ అంబానీ నూతన ఇంధన రంగ బిజినెస్‌ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. మరోవైపు ఆగస్టు నెలలో నీతా అంబానీ రిలయన్స్‌ బోర్డు డైరెక్టర్‌గా తప్పుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =