చిలకడ దుంపలు రుచిగా ఉంటాయని అందరికీ తెలుసు. కాకపోతే వాటిని బాగా కడుక్కొని, ఉడకబెట్టుకొని తినడం కొంచెం పనిని పెంచుతుంది కాబట్టి.. కొనడానికి ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ దుంపల ప్రత్యేకత అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన పోషకాలతో పాటు పిండి పదార్థాలు ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఈ స్వీట్ పొటాటోలను తింటే ఎన్ని ఉపయోగాలుంటాయో తెలుసు కాబట్టి.. ఇప్పుడు ప్రపంచమంతటా తింటున్నారు.
ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి..
ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఏ… వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది. చిలకడ దుంపలను కొంతమంది పచ్చివే తింటారు. అలా కూడా టేస్ట్ గానే ఉంటాయి. ఐతే… పచ్చివి ఎక్కువ తింటే… కడుపులో త్వరగా అరగవు. అందువల్ల ఉడకబెట్టుకొని తినడం మేలు. దుంపల్ని మట్టి లేకుండా కడిగాక… నీటిలో వేసే ముందే… నీటిలో కాస్త ఉప్పు, లేదా బెల్లం వేసి ఉడికిస్తే టేస్ట్ ఇంకా బాగుంటాయి.
ఎక్కువ పోషకాలు..
చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో గానీ వీటి నిండా పోషకాలే ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ , నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి.
ప్రేగుల ఆరోగ్యం..
ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి… పొట్టలో వ్యాధులు రాకుండా వాటికి రక్షణ కల్పిస్తాయి.
క్యాన్సర్ నుంచి పోరాడటానికి..
చిలకడ దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలిది. కొన్ని రణాల కాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.
కంటి చూపు కోసం..
స్వీట్ పొటాటోలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఆరెంజ్ కలర్‌లో ఉన్న చిలకడదుంపలు తింటే… కంటికి ఇంకా ఎక్కువ మంచిది. ఒకవేళ స్వీట్ పొటాటో దొరక్కపోతే, క్యారట్ తిన్నా కూడా ఇదే ఫలితం ఉంటుంది.
మెదడు పనితీరును పెంచడానికి..
చాలామంది రకరకాల టెన్షన్లతో బుర్ర పాడుచేసుకుంటున్నారు. ఇలాంటివారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి… కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. సో.. ఇప్పటి వరకూ ఎలా ఉన్నా.. ఇక నుంచి వీలున్నప్పుడల్లా స్వీట్ పొటాటోని డైలీ తినడానికి ట్రై చేయండి.