బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ లో స్పిన్ ది బాటిల్ టాస్క్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్‌ను ఎమోషనల్‌గా ఏడిపించేశాడు . హౌస్ మేట్స్ లో ఐదుమందికి తమ ఇళ్లనుంచి బిగ్ బాస్ స్పెషల్ గిఫ్ట్స్ ను అందించాడు. అయితే వారిలో ఇద్దరిని సెలక్ట్ చేసుకొని.. మిగిలిన వారికి లాలీ పప్స్ ఇచ్చి అవి ఆ ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఇస్తారో వారి గిఫ్ట్ ఇక్కడ ఉంటుందని మరొకరి గిఫ్ట్ తిరిగి వారింటికి వెళ్ళిపోతుందని చెప్పాడు. బిగ్ బాస్ అలా చెప్పగానే హౌస్ మేట్స్ ఏడవడం మొదలు పెట్టారు.
దీనిలో ముందుగా అభయ్, నిఖిల్‌ను బిగ్ బాస్ సెలక్ట్ చేశాడు . అభయకు తన తండ్రి వాచ్‌ను.. అలాగే నిఖిల్‌కు తన తండ్రి షర్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక అభయ్, నిఖిల్‌కు మిగిలిన హౌస్ మేట్స్ ఎన్ని లాలీ పప్స్ ఇస్తారో దాన్ని బట్టే.. ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంచాలో ఎవరి గిఫ్ట్ రిటర్న్ పంపించాలో నిర్ణయిస్తామని చెప్పాడు.
దాంతో ముందుగా అభయ్ మాట్లాడుతూ..అది తన నాన్న వాచ్ అని..ఆయన తన లైఫ్ లో ఒకే ఒక్కసారి హగ్ చేసుకున్నాడని గుర్తు చేస్తాడు. ఆయన మేథ్స్ టీచర్.. చాలా స్ట్రిక్ట్ అని. కానీ తాను సినిమాల్లోకి వెళ్తా అంటే తనను ఎంకరేజ్ చేసింది నాన్నే నంటూ చెప్పాడు. తాను సంపాదించి ఆయనకు కొన్న మొదటి గిఫ్ట్ అది అని… ఆయన ఉన్నంతకాలం అదే పెట్టుకున్నారంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అభయ్.
ఆతర్వాత నిఖిల్ మాట్లాడుతూ.. అది తన నాన్న షర్ట్ అని చెప్పాడు. తాను ఊర్లో కంటే ఎక్కువగా బయటే ఉంటానని అందుకే ఆయన షర్ట్ ను తనతో ఉంచుకుంటానంటూ చెప్పాడు. బేసిక్‌గా నాన్నతో అబ్బాయిలకి అంత ప్రేమ చూపించే బాండింగ్ ఉండదని..అందుకే ఆయనకు హగ్ కూడా ఇవ్వలేమని అన్నాడు. ఆ ఫీల్ పోగొట్టుకోవడానికే ఆయన షర్ట్ దొంగతనంగా తెచ్చుకున్నానని.. అది వేసుకుంటే ఆయనను హగ్ చేసుకున్నట్టు ఉంటుందని నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.
వీరిద్దరూ ఆ గిఫ్టుల గురించి చెప్పాక..ఒకొక్కరు అభయ్, నిఖిల్ కు లాలీ పప్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎక్కువ లాలి పాప్‌లు ఇంటి సభ్యులు అభయ్‌కి ఇవ్వడంతో.. అభయ్‌కు బిగ్ బాస్ గిఫ్ట్ ఇచ్చాడు. నిఖిల్ గిఫ్ట్ ను మాత్రం తిరిగి పంపించేశాడు. దీని తర్వాత నిఖిల్ దగ్గరకు వెళ్లిన సోనియా కాస్త ఎమోషనల్ అవుతూ మాట్లాడింది.