బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ వీక్‌ను కూడా పూర్తి చేసుకుంది. రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోన్న ఉత్కంఠకు తెరదించిన నాగ్ .. ఆర్జే శేఖర్ భాష హౌస్‌ను బయటకు పంపారు. బిగ్ బాస్ సీజన్‌కే బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటూ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా హోస్ట్ అక్కినేని నాగార్జునప్రకటించారు. తొలి వారం బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ శేఖర్ భాషాలు హౌస్‌ను వీడిపోవడంతో.. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.
ఇక మూడో వారానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులను శక్తి, కాంతారా అని టీములుగా విభజించి.. శక్తి క్లాన్కు నిఖిల్, కాంతారా క్లాన్కు అభయ్‌లు చీఫ్లుగా ఉంటారని చెప్పారు నాగ్. ఏ క్లాన్లోకి వెళ్లాలన్నది కంటెస్టెంట్స్‌కే వదిలేశాడు కింగ్. దీంతో నిఖిల్ టీమ్‌లోకి విష్ణుప్రియ, సోనియా, పృథ్వీ, శేఖర్ భాషా, సీత, నైనిక వచ్చారు. అభయ్ టీమ్‌లోకి ప్రేరణ, యష్మీ గౌడ, ఆదిత్య ఓం, నబీల్, నాగమణికంఠ వెళ్లారు.
తర్వాత నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ అవుతా రాగా.. చివరికి శేఖర్ భాషా, ఆదిత్య ఓం మిగుల్తారు. వీరిలో ఎవరు ఇంట్లో ఉండాలి.. ఎవరు బయటకు వెళ్లాలనేది కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారని నాగ్ చెప్పగా ఆదిత్య ఓం ఇంట్లోనే ఉండాలని ఎక్కువమంది ఓట్లు వేయడంతో శేఖర్ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు. సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ అని.. నాగమణికంఠ ఫేక్ అని శేఖర్ భాషా వెళ్తూ వెళ్తూ చెబుతాడు.
దీంతో మూడో వారం మాత్రం ఓ రేంజ్లో జరుగుతాయని అర్ధమవుతోంది. కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిపై చెత్తను కుమ్మరించి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పృధ్వీతో.. అతను గెలవాలన్న స్పిరిట్ తనకిష్టం అని, కానీ అతను ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదని సీత .. అంటుంది. దీంతో తానొక టీమ్‌లో ఆడినప్పుడు .. అపోజిట్ టీమ్‌ని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృధ్వీ చెబుతాడు.
యష్మీని నామినేట్ చేసిన మణికంఠ తన రీజన్స్ కూడ చెప్పాడు. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు. అయితే తమ టీమ్‌కి పవర్ వచ్చినప్పుడు ఆ అవసరం లేదని యష్మీ సమాధానమిస్తుంది. దీంతో చిరాకు పడిన మణికంఠ.. తాను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు. దీంతో తన దగ్గరికొచ్చి డ్రామాలు చేస్తావంటూ యష్మీ డైలాగ్ వదులుతుంది. తనకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైజ్ చేస్తానని మణికంఠ చెప్పగా.. నువ్వేంటీ బొక్క రైజ్ చేసేదని యష్మీ లిమిట్ దాటి మాట్లాడుతుంది.
ఆ వెంటనే మణికంఠపై రివెంజ్ తీర్చుకునేలా రివర్స్‌లో నామినేట్ చేసింది.. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్‌లో తీసుకుంటానని తేల్చి చెబుతుంది యష్మీ.అతను తన హార్ట్ బ్రోక్ చేశాడని.. ఫ్రెండ్షిప్ పేరుతో తనను మోసం చేశాడని మండిపడుతుంది. అది మోసం కాదని మణికంఠ ఏదో చెప్పబోతుండగా.. ఇది తన నామినేషన్ గురూ నిల్చో అనడంతో.. అయితే చూస్తా గురూ అని మణికంఠ గట్టిగా బదులిచ్చాడు.
అలాగే సాక్స్ టాస్క్‌లో సంచాలక్‌గా సరిగా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేయగా.. సోనియాను నైనిక నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం ప్రేరణ, సోనియా , పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ఉన్నారు. దీంతో సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ హాట్ హాట్‌గానే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.