విలక్షణ తమిళ నటుడు సూర్య ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నడన్నది సినీ ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ‘ధూమ్ 4′ సినిమాలో విలన్ రోల్ చేయాల్సిందిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను యష్ రాజ్ ఫిలిమ్స్ అప్రోచ్ అయ్యింట. ధూమ్ సిరీస్ సినిమాలకు నార్త్ ఇండియా తో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. ధూమ్ మొదటి సినిమాలో జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. రెండో సినిమా వచ్చేసరికి బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులు అందరినీ మెప్పించారు. ధూమ్ 3 వచ్చేసరికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారు. ఆయన విలనిజం చూసి ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు.
ప్రతినాయకుడిగా కనిపించడం సూర్యకు కొత్త ఏమీ కాదు. ఫస్ట్ టైం ’24’ సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. అయితే అందులో హీరో కూడా ఆయనే. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజు రూపొందించిన ‘విక్రమ్’ సినిమాలో మరోసారి విలన్ గా చేశారు. ‘విక్రమ్’ సినిమాలో సూర్య పాత్ర నిడివి తక్కువే. అయినా సరే రోలెక్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమా వరకు ఆయన విలన్ కాదు. ఎందుకంటే… ఆ సినిమా తర్వాత రోలెక్స్ పాత్రను బేస్ చేసుకుని ఒక సినిమా తీయాలని లోకేష్ కనకరాజు ప్లాన్ చేస్తున్నారు.’కేజిఎఫ్’, ‘సలార్’ తరహాలో రోలెక్స్ క్యారెక్టర్ ఆ సినిమాలో హీరో అవుతుంది. మరి ‘ధూమ్ 4’ సినిమాకు సూర్య ఓకే చెబుతారా? లేదా? అనేది చూడాలి.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలివుడ్ ఇలా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ధూమ్ 4. ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్‌లో ప్రొడక్షన్ లో నిర్మాణం జరగనుంది. ఆదిత్య చోప్రా , అయాన్ ముఖర్జీ, విజయ్ కృష్ణ ఆచార్య మరియు శ్రీధర్ రాఘవన్ ఈ ప్రాజెక్ట్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా కోలీవుడ్ స్టార్ సూర్య విలన్ గా నటించనున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ప్రొడక్షన్ హౌస్ నుండి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు.