అన్ని కల్తీలతో పాటు ఇప్పుడు పన్నీరును కూడా డూప్లికేట్ చేసేస్తున్నారు. మరి ఇంత ప్రమాదకరమైన నకిలీ పన్నీరును తింటే ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి పాలతో తయారు చేసిన పన్నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పన్నీర్‌లో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి మన శరీరానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ నకిలీ పన్నీరు తినడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
పన్నీర్ ప్రోటీన్ కొవ్వు ప్రధాన వనరులలో ఒకటి. అంతే కాకుండా ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, శక్తి, కాల్షియం, భాస్వరం, విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అనేక రకాల పోషకాలు కలిగిన నిజమైన పన్నీరు మనకు అనేక ప్రయోజనాలను తెస్తుంటే…మరోవైపు, హానికరమైన పదార్ధాలను కలపడం ద్వారా తయారు చేసిన నకిలీ పన్నీరు అనేక విధాలుగా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.
నకిలీ పన్నీరు తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం, కామెర్లు, పుండ్లు వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు నకిలీ పనీర్ తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద దద్దుర్లు, అజీర్ణం లాంటి సమస్యలు కూడా రావచ్చు. పన్నీర్ ..భోజన ప్రియులకు ఫేవరేట్ ఫుడ్. ఇక వెజిటేరియన్లకైతే మరీ ఎక్కువ. పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్, పాలక్ పన్నీర్ ఇలా చాలా రకాలుగా తింటూ ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ ను స్నాక్స్ గా..కర్రీగానూ తినొచ్చు. ఈ ప్రయోజనాలన్నీ నిజమైన పన్నీర్ తోనే సాధ్యమవుతాయి. దీనికి విరుద్ధంగా నకిలీ పన్నీర్ తినడం వల్ల మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది.
నకిలీ పన్నీర్ ఎలా గుర్తించాలి
ఒరిజినల్ పన్నీర్ మృదువుగా ఉంటుంది. కానీ పన్నీర్ గట్టిగా ఉంటే అది పక్కా డూప్లికేట్ అనే అర్థం. నకిలీ పన్నీరును సులభంగా తినలేము. కొంచెం రబ్బర్ లాగా సాగుతుంది. నకిలీ పన్నీరును ఇలా చెక్ చేయొచ్చు. పన్నీర్‌ను వేడి నీటిలో వేసి ఆపై చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పన్నీర్ మీద 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. పనీర్ రంగు నీలం రంగులోకి మారితే అది కచ్చితంగా నకిలీ అని అర్థం చేసుకోండి. ఏది ఏమయినా మార్కెట్లో దొరికే పన్నీర్ ఇంటికి తెచ్చుకునేముందు కాస్త ఆలోచించి తీసుకోండి. ఏమాత్రం అనుమానం వచ్చినా ఇంటికి వచ్చాక పరీక్షించుకోండి.