ఒకప్పుడు అందానికి, హెయిర్ కేర్ కు అమ్మాయిలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మహిళలతో పాటు మగవాళ్లూ పోటీ పడుతున్నారు. ఫిట్‌నెస్ కోసం ఎన్ని తిప్పలు పడతారో.. అలాగే అందం కోసం అలాగే పాట్లు పడుతున్నారు. అయితే వ్యాయామం చేయడం ద్వారా స్కిన్, హెయిర్ కు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు.
రోజూ చేసే వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుని ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు చర్మం, జట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుచుకోవచ్చని ఫిట్‌నెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రకాల ఎక్సర్సైజ్లతో ఇవి సాధ్యం అంటున్నారు. ఇవి చేస్తే టెస్టోస్టిరాన్, ఇతర హార్మోన్లు పెరగడంతో పాటు డొపమైన్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు.
స్క్వాట్స్
వ్యాయామంలో స్క్వాట్స్ చాలా ఇంపార్టెంట్. ఓ చోట నిల్చొని.. పాదాలు, మోకాళ్లు ఆధారంగా కుర్చీలో వెనుకకు కూర్చున్నట్టు బెండ్ అవుతూ లేవడాన్ని స్క్వాట్స్ అంటారు. ఇలా ఫాస్ట్ పాస్ట్ గా ఈ వ్యాయామాన్ని చేయాలి. స్టార్టింగ్ లో స్టాండర్డ్ స్క్వాట్ చేసినా… జంపింగ్ స్క్వాడ్, గోబ్లెట్ స్వ్కాట్, సుమో స్క్వాట్ లను కూడా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
డెడ్లిఫ్ట్
డెడ్లిఫ్ట్.. వెయిట్ లిఫ్టింగ్ లాగే ఉంటుంది. రాడ్కు డార్బెల్స్, బార్స్ లోడ్ చేసిన దాన్ని ఎత్తడమే డెడ్లిఫ్ట్. నేలపై ఉన్న ఈ బరువును చేతులపై ఎత్తాలి. పపర్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ల్లో ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. బరువు పెంచాలనుకుంటే బార్స్ వెయిట్ పెంచితే సరిపోతుంది. దీనికి గ్రిప్ కూడా చాలా ముఖ్యం.
చెస్ట్ ప్రెస్
చెస్ట్పై ఒత్తిడి కలిగే విధంగా చేసే ఎక్సర్సైజ్లను చెస్ట్ ప్రెస్ అంటారు. జిమ్లోని వివిధ పరికరాలతో ఈ చెస్ట్ ప్రెస్ వ్యాయామాలు చేయవచ్చు. వీపు భాగంలో బేస్ ఉంచుకొని ఈ చెస్ట్ ప్రెస్ ఎక్సర్సైజ్లు చేయాలి. కేబుల్, డంబుల్స్ సాయంతోనూ ఇవి చేయవచ్చు. అలాగే కూర్చొని, నిల్చొని చేసే చెస్ట్ ప్రెస్ ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి.
ఈ మూడు విధాల ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా ఫిజికల్ గా ఫిట్గా ఉండడంతో పాటు స్కిన్ లో షైనింగ్, హెయిర్ గ్రోత్ కూడా మెరుగ్గా ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్సర్సైజ్లతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. కానీ ఇప్పటికే జుట్టు రాలడం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు నిపుణుల సాయంతో ఎక్సర్‌సైజ్‌లు, డైట్ చేస్తే మంచిది.