కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి.. రంగంలోకి ఏఐసీసీ

Lolli Tickets In Congress AICC Enters The Field,Telangana Congress Ticket Fight,MLA Tickets Clash in Congress,Cong for election tickets in Telangana,Mango News,Mango News Telugu,Congress in Telangana,Fight on for tickets in Warangal Congress,Telangana Congress Party,All India Congress Committee,All India Congress Committee Latest News and Updates,All India Congress Committee Latest News,AICC Telangana Committee,All India Congress Committee Telangana
Telangana Congress, Congress, TPCC, Revanth Reddy, Congress Candidates, Telangana Assembly elections

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్‌కు మరో 48 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు అధికార పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. మరో రెండు రోజుల్లో గులాబీ బాస్ కూడా రంగంలోకి దిగనున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయడం వద్దే ఆగిపోయింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పోటీ తీవ్రంగా ఉండడంతో.. తలపట్టుకొని కూర్చుంది. మొన్నటి వరకు ఎన్నికలకు రావాలంటూ సవాళ్ల మీద సవాళ్లు విసిరిన కాంగ్రెస్.. తీరా వచ్చాక గమ్మునుంటోంది.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నాలుగు సార్లు సమావేశమయింది. అయినప్పటికీ అభ్యర్థుల లెక్క తేలలేదు. ఇందుకు కారణం సీనియర్లు తాము సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అలాగే పీసీసీ చీఫ్ సూచించిన పేర్లకు భిన్నంగా.. సర్వేల్లో కొత్త పేర్లు బయటకొచ్చాయట. దీంతో అభ్యర్థుల ఎంపిక చేయడం పెద్ద హెడ్‌ఏక్‌గా మారింది. అయితే ఎట్టకేలకు 72 స్థానాలకు మాత్రం స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇక సూర్యాపేట, తాండూరు, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కాస్త కష్టతరంగా ఉందట. అక్కడ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొందట. ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహనరావు, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే స్క్రీనింగ్ కమిటీలో ఇద్దరు నాయకులు వీరిలో ఒకరికి సపోర్ట్ చేస్తుంటే.. మరో నాయకుడు మాత్రం మిగిలిన వ్యక్తికి మద్ధతు ఇస్తున్నారట. దీంతో ఇద్దరిలో టికెట్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక పెండింగ్‌లో పెట్టారట. అటు తాండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. స్క్రీనింగ్ కమిటీలోని సభ్యులు కేఎల్ఆర్‌కు కొందరు.. మనోహర్ రెడ్డిలకు కొందరు సపోర్ట్ చేస్తుండడంతో ఈ స్థానాన్ని కూడా పెండింగ్‌లో ఉంచేశారట.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు ఖమ్మంలో మరో పెద్ద చిక్కొచ్చి పడింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాలేరు టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చాకే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు టికెట్ కోరుతున్నారు. ముందు నుంచి పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సడెన్‌గా పొంగులేటి ప్లేట్ మార్చారు. పాలేరు టికెట్ కావాలని పట్టుపట్టుకొని కూర్చుకున్నారు. అటు తుమ్మల కూడా పాలేరు టికెట్ కోసం తగ్గేదే లే అంటున్నారట.

అలాగే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినప్పుడు అధిష్టానం ఆయనకు కీలక హామీ ఇచ్చింది. పొంగులేటి సూచించిన క్యాండిడేట్లకు సిట్టింగ్‌లు లేని నియోజకవర్గాల్లో ప్రధాన్యం ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు సిట్టింగ్‌లు లేని కొన్ని స్ధానాలకు పొంగులేటి కొందరు అభ్యర్థులను సూచించారట. కానీ ఆయా స్థానాలకు భట్టి విక్రమార్క వేరే అభ్యర్థులను సూచిస్తున్నారట. ఇలా అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలా అభ్యర్థుల ఎంపిక రోజురోజుకు ఆలస్యమవుతుండడంతో.. ఇక ఏఐసీసీ రంగంలోకి దిగక తప్పలేదు. పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను స్క్రీనింగ్ కమిటీ ఏఐసీసీకి వదిలిపెట్టిందట.ఈనెల 14న ఏఐసీసీ, స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఎన్నికల ముందుగా జరగనున్నాయి.. తెలంగాణలో చివరి దశలో జరగనున్నాయి. ఈక్రమంలో ఈరోజు, రేపు ఆయా రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేయనుందట. ఆ తర్వాత తెలంగాణ క్యాండిడెట్లపై ఫోకస్ చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి ఈసారి అయినా అభ్యర్థుల లెక్క తేలుతుందా? లేదా? అనేది చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 13 =