భారతీయులకు ఆస్ట్రేలియా గ్రేట్ న్యూస్ చెప్పింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించి ఆస్ట్రేలియా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయులకు ప్రతి ఏడాది ఇకపై 100 వర్క్, హాలీడే వీసాలను జారీ చేయడానికి రెడీ అయింది.
ఆర్థిక, వాణిజ్య సహకార ఒప్పందం ప్రకారం, ఈ వీసాలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి జారీ చేయబడతాయని ఓ ప్రకటన ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంలో కీలకమైన వర్క్, హాలీడే వీసా కార్యక్రమం అన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పడం సంతోషంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
రెండు దేశాల మధ్య రాకపోకలు, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవ్వడానికి ఇది దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించిన పీయూష్ గోయల్ ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ వీసా ప్రక్రియ కింద 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యూత్ ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలల పాటు ఆస్ట్రేలియాలో టెంపరరీగా నివసించడానికి అర్హులని తెలిపారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 23-26 తేదీల మధ్య ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఈ వివరాలను సంతోషంగా ప్రకటించారు. డిసెంబర్ 2022లో AI-ECTA ఒప్పందం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీసా కార్యక్రమం రెండు దేశాల మధ్య రాకపోకలు, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.