బిగ్‌బాస్ సీజన్ 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం నామినేషన్స్ పూర్తవడంతో ఈ వీక్ ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇక హౌస్ విషయానికి వస్తే..ముందుగా డేంజర్ జోన్లో ఉన్న మణికంఠను జైల్లో పెట్టాలని బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌ను ఆదేశించాడు. అతనికి ఫుడ్ పెట్టే బాధ్యతని కిర్రాక్ సీతకి అప్పగించాడు. సోనియా వెళ్లిపోవడంటో విష్ణుప్రియ, ప్రేరణ ఆమెకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటారు. తన గురించి చెడుగా చెప్పిన విష్ణుప్రియను వదిలిపెట్టనని.. నామినేషన్లో దీనిని కచ్చితంగా పాయింట్ రైజ్ చేస్తానని నిఖిల్ చెబుతాడు. కాసేపటికీ మణికంఠను జైలు నుంచి విడుదల చేయాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో..మణికంఠను నబీల్, ఆదిత్య ఓంలు భుజాలపై ఎత్తుకుని తీసుకొస్తారు.
అనంతరం ఐదో వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలని ..వారి ఫోటోలును ఫైర్‌లో వేయాలని బిగ్ బాస్ చెబుతాడు. చీఫ్లుగా ఉండటంతో సీత, నిఖిల్‌లను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పిన బిగ్ బాస్ చివరిలో చీఫ్లుగా ఉన్న నిఖిల్, సీతలకు ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్‌లలో ఒకరిని సేవ్ చేసి, మరొకరిని నామినేట్ చేయాలని హౌస్ మేట్స్ ను ఆదేశించారు. మెజారిటీ సభ్యులు సీతను సేవ్ చేయాలని అభిప్రాయపడటంతో నిఖిల్ కూడా ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చాడు.
మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ విష్ణుప్రియ, నైనిక, మణి, ఆదిత్య ఓం, నబిల్, నిఖిల్ నామినేషనల్లో ఉన్నారు. ఇక ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని నాగార్జున పెద్ద బాంబు పేల్చాడు. ఒకటి మిడ్ వీక్, రెండోది ఆదివారం నామినేషన్లు ఉండటంతో.. ఆ ఇద్దరు ఎవరు అన్నది సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు..ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 24.9 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు. అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 24.9 శాతం ఓటింగ్‌తో గట్టి పోటీనే ఇస్తున్నాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా మణికంఠ 18.2 శాతం ఓట్లతో టాప్ 3లో నిలవగా.. యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్‌లో వెనుకబడింది.
గతంలో టాప్‌లో ఉన్న విష్ణుప్రియ ఈ వారం మాత్రం కేవలం 16.7 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఆదిత్య ఓంకు 11.3 శాతం ఓట్లు, నైనికకు 9 శాతం ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీరిలో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. అయితే ఈ రెండ్రోజుల్లో ఓటింగ్‌ను బట్టి రిజల్ట్స్ తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.