మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రా మచ్చా మచ్చా సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. థమన్ ఈ గేమ్ ఛేంజర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. ఈ మూవీ మ్యూజిక్ విషయంలో థమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేలా గేమ్ ఛేంజర్ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీ విషయంలో నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ను వీలైనంత వేగంగా రిలీజ్ చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ మూవీ నుంచి వరుస అప్ డేట్స్ ఒక్కొక్కటి వస్తుండగా..తాజాగానే నిర్మాత దిల్ రాజు కూడా అవైటెడ్ టీజర్ ఈ అక్టోబర్ లోనే వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అక్టోబర్ లోనే టీజర్ రిలీజ్ కానీ అది ఎప్పుడు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఈ సినిమా టీజర్ ని దసరా కానుకగా అందించబోతున్నట్లు లేటెస్ట్ గా థమన్ క్లారిటీ ఇచ్చేసారు.
దీంతో గేమ్ ఛేంజర్ అవైటెడ్ టీజర్ దసరా కానుకగా రాబోతుందటంటూ మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. . ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ డిసెంబర్ 20న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో ఐఏఎస్ రోల్ లో కనిపిస్తారని.. ఆ పాత్రలో చెర్రీ షార్ట్ టెంపర్ ఉన్నట్లుగా కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఎస్జే సూర్య , శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.