హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితమే హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. హర్యానాలో అధికారంలోకి రావాలంటే 46 సీట్లు గెలవాలి.
90 మంది సభ్యుల బలం ఉన్న హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అంతర్గత విభేదాల మధ్య ఎన్నికలను ఎదుర్కొన్నాయి.
హర్యానాలో బీజేపీ ఒంటరిగా, కాంగ్రెస్-సీపీఐ(ఎం), జేజేపీ-ఏఎస్పీ, లోక్ దళ్-బీఎస్పీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. బీజేపీ 89 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ కూటమి 90 నియోజకవర్గాల్లో, జేజేపీ-ఏఎస్పీ 78 నియోజకవర్గాల్లో, లోక్ దళ్-బీఎస్పీ 86 నియోజకవర్గాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 88 నియోజకవర్గాల్లో పోటీ చేశాయి.
ఇక్కడ రైతులకు మద్దతు ధర అంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం లేదు. ద్రవ్యోల్బణం సమస్య, ఢిల్లీ సరిహద్దులో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. ఏది ఏమైనా మరో మూడు రోజులు ఆగాల్సిందే.
జమ్మూ కశ్మీర్ లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని, ఉన్నవాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.