గేమ్ చేంజర్ మూవీ షూటీంగ్ కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు.. తన తదుపరి చిత్రం బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. శంకర్ గేమ్ చేంజర్ వల్ల బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఇదే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అందుకే రామ్ చరణ్ తన మేకోవర్‌ను కూడా చేంజ్ చేసుకుంటున్నాడు. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే లోపు బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్ మీదకు రామ్ చరణ్ వెళ్లేలా కనిపిస్తున్నాడు.
RC16 కోసం చరణ్ గడ్డం పెంచుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వి.వి.వినాయక్ బర్త్ డే సందర్బంగా ఆయనకు విషెష్ తెలియచేయడానికి వచ్చిన చరణ్.. ఈ సందర్బంగా ఆయన గడ్డం తో కనిపించేసరికి బుచ్చిబాబు సినిమా కోసమే ఇలా గడ్డం పెంచుతున్నట్లు ఉందని కామెంట్స్ పెడుతున్నారు. రంగస్థలం నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ భారీ దేహంతో కనిపించబోతోన్నాడు. బీస్ట్ మోడ్‌లోకి మారబోతోన్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో IAS ఆఫీసర్ కావడంతో క్లీన్ షేవ్‍తో క్లాసీ లుక్‍తో ఉన్న ఈ చరణ్.. బుచ్చిబాబు సినిమాకోసం ట్రాన్స్‌ఫర్‌మేషన్ అవుతున్నాడట.. కండలు పెంచేందుకు వర్కౌట్లు చేస్తున్నాడట. ఇక ఇప్పటికే మాస్ లుక్ కోసం గడ్డం పెంచేశారు. దీంతొ గతంలో ‘రంగస్థలం’ మూవీ లో కూడా చరణ్ గడ్డం తో కనిపించి హిట్ కొట్టాడు..ఇప్పుడు కూడా అలాగే హిట్ కొట్టబోతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుచ్చిబాబుతో మూవీ చెర్రీకి ల్యాండ్‍మార్క్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఇప్పుడే చెప్పేస్తున్నారు.
ఇక RC16 రంగస్థలంను మించేలా రామ్ చరణ్ మేకోవర్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కుస్తీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గాసిప్స్ వినిపిస్తుంటాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవరతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి.. రామ్ చరణ్ బుచ్చిబాబుతో మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు అయింది. మరోవైపు గేమ్ ఛేంజర్ టీజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. దసరా సందర్భంగా టీజర్ వస్తుందని అనుకుంటున్నారు.. అయితే అది కుదరదని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రిలీజ్ డేట్ అయినా ప్రకటించొచ్చు కదా అంటూ మేకర్లను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.