Ind vs Nz: తొలి టెస్ట్ సజావుగా సాగేనా..?

Ind Vs Nz Will The First Test Go Smoothly, Ind Vs Nz, Ind Vs Nz First Test, First Test, 3 Match Test Series Against New Zealand, Bangalore, Border Gavaskar Trophy, Chinnaswamy Stadium, Icc Test World Championship, Ind Vs Nz, Ind Vs Nz Test Series, The Weather In Bengaluru Is Cloudy And It Rains Incessantly, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లే ముందు టీమిండియా మరో టెస్టు పరీక్షను  ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది, మొదటి మ్యాచ్ అక్టోబర్ 16 నుండి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఐసిసి టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ మూడో ఎడిషన్‌లో భాగంగా సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ సాధించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు, ఇప్పుడు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ లో కూడా ఫేవరెట్ నిలవనుంది. కానీ, కొత్త కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యంలో.. ఆతిథ్య జట్టుకు షాకిస్తామని కివీస్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది.

కొద్ది రోజుల క్రితమే శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ ఓటమి చవిచూసింది. ఈ తర్వాత జట్టు కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్‌గా నియమించింది. కాగా తొలి టెస్టుకు వర్షం ముప్పు పోంచి ఉంది. గత రెండు రోజులుగా బెంగళూరులో వాతావరణం మేఘావృతమై ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ వారం మొత్తం బెంగళూరు మహానగరంలో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా బుధవారం, గురువారాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.  శుక్రవారం మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

మేఘావృతమైన వాతావరణం

అంటే తొలి టెస్టు మ్యాచ్‌లు జరిగే రెండు రోజుల్లో 40% వర్షం కురిసే అవకాశం ఉంటే, శుక్రవారం 67% వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు తేమ స్థాయి 98 శాతం ఉంటుంది. నగరంలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. కానీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారతదేశంలోని ఏ ఇతర స్టేడియంలో లేని అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. దీని వల్ల తేమ చాలా త్వరగా ఆరిపోతుంది. అందువల్ల వర్షం పడిన తర్వాత వెలుతురు లేని పక్షంలో రెండో సెషన్ తర్వాత మ్యాచ్ ఆడవచ్చు. అయితే అది ఎంతవరకు ఖచ్చితమో చెప్పడం కష్టం.

టీమ్ ఇండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సఫ్రాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.