ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీకి లీవ్, టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ ఎంపిక

First Test with Australia, Rohit Sharma Included in Test Squad, Tour of Australia, Virat Kohli, Virat Kohli granted paternity leave by BCCI, Virat Kohli paternity leave, Virat Kohli to get paternity leave, Virat Kohli to take Paternity Leave, Virat Kohli to take Paternity Leave after First Test with Australia

త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత జట్టును కూడా బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదివారం నాడు సమావేశమై మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ 26 న జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలోనే అడిలైడ్‌లో జరిగే మొదటి టెస్ట్ తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని తన ప్రణాళికల గురించి బీసీసీఐకి తెలియజేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవు(పాటర్నిటీ) మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ అనంతరం కోహ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు.

మరోవైపు బీసీసీఐ వైద్య బృందం రోహిత్ శర్మ యొక్క ఫిట్ నెస్ ను పర్యవేక్షించి, సెలెక్షన్ కమిటీకి వివరించింది. దీంతో రోహిత్ శర్మతో సంప్రదించి పూర్తి ఫిట్‌నెస్‌ను పొందేందుకు ఆస్ట్రేలియాలోని జరిగే వన్డేలు మరియు టీ-20 లలో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత టెస్ట్ జట్టులో రోహిత్ ను చేర్చినట్టు ప్రకటించారు. అలాగే సంజు సామ్సన్ ను భారత వన్డే జట్టులో అదనపు వికెట్ కీపర్‌గా చేర్చారు. ఇక భుజం గాయం కారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టీ 20 సిరీస్ తప్పిస్తున్నామని, అతని స్థానాన్ని టి నటరాజన్ భర్తీ చేస్తాడని సెలక్షన్ కమిటీ వెల్లడించింది. ఆస్ట్రేలియాతో నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు భారత జట్టు 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =