విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ మరియు సౌరవ్ గంగూలీలపై విరుచుకుపడ్డాడు. వన్డే మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్‌గా లేదా 3వ డౌన్ లొ ఆడే సౌరవ్ గంగూలీ టెస్టుల్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడు. రాహుల్ ద్రవిడ్ ఆర్డర్ మాత్రమే అవసరాన్ని బట్టి మారుతోంది.
ఇప్పుడు బెంగుళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, శుభ్‌మాన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగాడు. దీంతో విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్.. అతను జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గంగూలీ, టెండూల్కర్ లు వైట్ బాల్ క్రికెట్‌లో ఓపెనర్లుగా ఆడేందుకు ఆసక్తి చూపారు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం టాప్ ఆర్డర్‌లో ఆడటానికి ఎప్పుడూ సిద్దంగా ఉండేవారు కాదు.. అయితే విరాట్ కోహ్లి ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకపోవడంపై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో వేదికగా ప్రసంశలు కురిపించాడు.. ఇదే నిజమైన ఛాంపియన్‌కి సంకేతం’’ అని కొనియాడారు.
ఇప్పుడు సచిన్, గంగూలీలపై సంజయ్ మంజ్రేకర్ చేసిన విమర్శలు ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ సాగుతోంది. టెస్టు క్రికెట్‌లో మొత్తం 15,921 పరుగులు చేసిన టెండూల్కర్ 85% పరుగులను నాలుగో స్థానంలో నుంచి వచ్చినవే. మరోవైపు టెస్టుల్లో 7212 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ అందులో 752 పరుగులు మాత్రమే ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడ్డు రాబట్టాడు.. ఇక ఓపెనర్‌గా 11 సౌరవ్ గంగూలీ పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్ మెన్ గా నిలదొక్కుకునే వరకు గంగూలీ వన్ డౌన్ లో ఆడటం గమనార్హం.
కోహ్లి ఔట్ అయిన తీరు నిరాశపరిచింది
న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 9 బంతులు ఎదుర్కొని రూర్క్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి సున్నా పరుగు వద్ద పెవిలియన్ కు చేరాడు. మరో ట్వీట్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయం ముందే చెప్పాను. ఇది మరలా చెబుతాను. విరాట్ ప్రతి బంతిని ఫ్రంట్‌ఫుట్‌లో ఆడడం ద్వారా ఔట్ అయ్యి మూల్యం చెల్లించుకునేవాడు. ఈరోజు బంతిని బ్యాక్ ఫుట్‌లో ఆడినప్పటికి ఔటయ్యాడని అది దురదృష్టవశాత్తు అలా జరుగుతుందని పేర్కొన్నాడు.