స్వచ్ఛమైన నెయ్యితో ఆరోగ్య సమస్యలకు చెక్..

How Many Benefits Of Pure Ghee, How Many Benefits Ghee, Benefits Ghee, Pure Ghee Benefits, Adavantages Of Pure Ghee, Health Benefits For Pure Ghee, Benefits Of Pure Ghee, Check For Health Problems With Ghee, Many Benefits Of Pure Ghee, Health, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

చాలామంది నెయ్యి అంటేనే అమ్మో కొలస్ట్రాల్ అని పరుగులు పెడతారు. నిజానికి కావాల్సినంత మోతాదులో తీసుకుంటే నెయ్యిని మించిన ఔషధం లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో ఉండే ఈ నిధి మీ ఆరోగ్యాన్ని సుసంపన్నం చేస్తుందని హామీ ఇస్తున్నారు.
కళ్లకు మేలు..
స్వచ్ఛమైన నెయ్యి కళ్లకు అమృతంగా చెప్తారు. ప్రతిరోజూ ఈ నెయ్యిని తీసుకుంటే అది కంటికి మేలు చేస్తుంది. దృష్టిలోపం ఉన్నవాళ్లు రోజూ నెయ్యిని వాడితే అది కళ్లద్దాలతో పని లేకుండా చేస్తుంది. నెయ్యిలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి.
కొలెస్ట్రాల్‌ని నియంత్రించడానికి..
స్వచ్ఛమైన నెయ్యి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగిస్తుంది. ఈ నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి హాని కలిగించదు. ఇందులోని కొలెస్ట్రాల్‌ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యి తిన్న తర్వాత తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నెయ్యి తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకలకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉన్న వ్యక్తులకు… నెయ్యి తినమని డాక్టర్లు సూచిస్తున్నారు. పప్పుతో నెయ్యిని ఉపయోగిస్తే ఎముకల బలహీనత తొలగిపోతుందని అంటున్నారు.
బరువు తగ్గడానికి..
నెయ్యిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. నెయ్యిలో 99.9 శాతం కొవ్వు, 1 శాతం కొవ్వులో కరిగే విటమిన్‌లతో పాటు తేమ, పాల ప్రోటీన్ ఉంటాయి. నూనెకు బదులుగా నెయ్యి వాడాలి కానీ.. నూనె వాడుతూ అడిషనల్ గా నెయ్యి వాడితే మాత్రం బరువు పెరిగిపోతారు.
నెయ్యిలో ఉండేవి..
వాల్‌నట్స్, చేప నూనె, అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి వనరులు. ఇవి క్యాన్సర్, గుండెపోటు, ఇన్సులిన్ నిరోధకత, ఆర్థరైటిస్, హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. అయితే ఒమేగా 3 ఫ్యాట్ , ఒమేగా 6 నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడంతో పాటు చర్మానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఇలా బరువు తగ్గొచ్చు..
నెయ్యిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి తినడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటుంది. కొవ్వు కణాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యిని రెండు స్పూన్ల కంటే ఎక్కువ తినకూడదని గుర్తుంచుకోవాలి.