బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హాటుహాటుగా సాగంది. సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో..దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి వాటికి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా ఇంటి సభ్యులతో బిగ్ బాస్ చెప్పాడు. మెగా చీఫ్ అయినందుకు గౌతమ్ కృష్ణను మాత్రం ఎవరు నామినేట్ చేయకూడదని అంటాడు.
మరోవైపు ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉందని.. ఆ నామినేషన్ షీల్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ హౌస్ మేట్‌ను ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి 50 వేల రూపాయలు బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని అనౌన్స్ చేస్తాడు. దాంతో ఆ నామినేషన్ షీల్డ్‌ను మెగా చీఫ్ గౌతమ్ హరితేజకు ఇచ్చాడు .
బిగ్ బాస్ తెలుగు 1లో ఆమె ఫైర్ చూశానని. ఈ వారం సేవ్ అయి మరో వారం వరకు ఉండి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని హరితేజకు ఆ నామినేషన్ షీల్డ్ ఇస్తున్నట్లు గౌతమ్ చెప్పాడు. దీంతో విష్ణుప్రియతో 8వ వారం నామినేషన్స్ ప్రారంభమైంది. ప్రేరణ, నిఖిల్‌ను విష్ణుప్రియ నామినేట్ చేయగా.. పృథ్వీ, నిఖిల్‌ను రోహిణి నామినేట్ చేశారు.
మెహబూబ్, నిఖిల్‌ను నయని పావని నామినేట్ చేయగా.. పృథ్వీ రోహిణిపై రివేంజ్ నామినేషన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ సాగింది. అలాగే, ప్రేరణను కూడా పృథ్వీ నామినేట్ చేశాడు. అయితే ప్రేరణ మాత్రం మెహబూబ్‌ను హరితేజ నామినేట్ చేసింది. తర్వాత నబీల్ ప్రేరణ అండ్ హరితేజను నామినేట్ చేశాడు.
హరితేజను నామినేట్ చేస్తుండగా.. ఆమెను నామినేట్ చేస్తే 50 వేల రూపాయలు కట్ అవుతాయని ఇంటి సభ్యులు గుర్తు చేశారు. డబ్బులు డిడక్ట్ కానీ, నా నామినేషన్ పాయింట్ తను మాత్రమేనని విన్నర్ ప్రైజ్ మనీ గురించి లెక్క చేయకుండా హరితేజను నబీల్ నామినేట్ చేశాడు .
కాగా అక్టోబర్ 22 నాటి ఎపిసోడ్‌లో కూడా ఎనిమిదో వారం నామినేషన్స్ కొనసాగనున్నాయి. ఈవారం రెండో రోజు నామినేషన్స్‌లో విష్ణుప్రియ, మెహబూబ్‌ను యష్మీ నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, పృథ్వీ, నిఖిల్‌ను అవినాష్, నిఖిల్, విష్ణుప్రియను గంగవ్వ నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. హరితేజను నామినేట్ చేసిన మరో హౌజ్ మేట్ కు 50 వేలు రూపాయల కట్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఐదు నామినేషన్ ఓట్లు నిఖిల్‌కు పడగా.. నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వారిలో నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నయని పావని, మెహబూబ్ నామినేట్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. హరితేజకు నామినేషన్ షీల్డ్ ఉండటంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయింది.