WTC ఫైనల్ చేరాలనుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. పుణేలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఈ టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి చవిచూసింది టీమిండియా. అందరూ ఊహించినట్లుగానే… మూడవ రోజే ఈ మ్యాచ్ పూర్తయిపోయింది.
రెండవ ఇన్నింగ్స్ లో… 245 పరుగులకే టీమిండి ఆల్ అవుట్ అయింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ లెటర్ బ్యాటర్లు ఎవరు కూడా… రాణించకపోవడంతో… రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీమిండియాలో యశస్వి జైస్వాల్ 77 పరుగులు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 42 పరుగులు మినహా ఏ ఒక్క ప్లేయర్ ఆడలేదు. దీంతో 245 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. అంతేకాదు… మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయింది టీమ్ ఇండియా.
సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో జోరుమీదున్న టీమిండియా రికార్డుకు కివీస్ అడ్డుకట్ట వేసింది. బెంగళూరు టెస్టులో 46కే ఆలౌట్ అయిన టీమిండియా ఈసారి టర్నింగ్ పిచ్ మీద 156 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పోరాడి సిరీస్ సమం చేస్తుందనుకుంటే.. 245 పరుగులకే చాప చుట్టేసింది. స్వదేశంలో స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే భారత్.. ఈసారి అదే అస్త్రానికి తలవంచి సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించేసింది. మిచెల్ సాంట్నర్(6,/106) సంచలన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను విజయం వాకిట నిలిపాడు. దాంతో, మరో టెస్టు ఉండగానే కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది.
ఓవర్‌నైట్ స్కోర్ 198-5తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను జడేజా దెబ్బ కొట్టాడు. డేంజరస్ గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. 255 పరుగులకు ఆలౌటయ్యింది.
359 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. సిరీస్‌లో నిలవాలంటే పోరాడాల్సిన చోట భారత బ్యాటర్లు మళ్లీ అదే తడబాటును కొనసాగించారు. మిచెల్ సాంట్నర్ను ఎదుర్కోలేక వరుసగా డగౌట్ చేరారు. అయితే రవీంద్ర జడేజా చివర్లో కివీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. అయితే చివర్లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు.