సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం SSMB 29 భారీ బడ్డెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాకు కావల్సిన లోకేషన్ల వెతికే పనిలో రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సర్చ్ చేస్తున్నారు. చూస్తుంటే స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇలా బయటకు వచ్చి లొకేషన్లను వెతికే పనిలో రాజమౌళి పడ్డాడనిపిస్తోంది. కార్తికేయ కూడా హింట్ల మీద హింట్లు ఇస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. అలాగే.. ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ తగ్గట్టుగానే ఈ సినిమాను గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కన్నారట. ఈ తరుణంలో మూవీ షూటింగ్ కోసం.. ఎడారిలో తిరుగుతున్నట్లు ఓ ఫొటో షేర్ చేశారు రాజమౌళి. పైగా.. “కనుగొనుకోవడానికి తిరుగుతున్నా” (Trotting to Discover) అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్కూడా పెట్టారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక మహేష్ బాబు అయితే ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చాడు. లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఇంత వరకు గుబురు గడ్డంతో మహేష్ బాబు కనిపించింది లేదు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్ కాబట్టి.. ఆయనకు నచ్చిన లుక్కులోకి మారాల్సి ఉంటుంది. అందుకే మహేష్ సైతం తన కెరీర్‌లో మొదటి సారిగా ఇలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత వరకు రంగు చెడని, దుమ్ము పడని, క్రాఫ్ చెదరని పాత్రల్లో మహేష్ బాబు కనిపించాడు. కానీ రాజమౌళి మూవీలో మాత్రం మహేష్ బాబుతో అన్ని ఫీట్లు చేయించేలా ఉన్నారు. ఫ్యాన్స్‌కు మాత్రం ట్రీట్ ఇచ్చేలా మహేష్ బాబు ప్రజెన్స్ ఉంటుందనిపిస్తోంది. ఈ మూవీకి అన్ని దేశాల్లోనూ ఈజీగా బిజినెస్ అవుతుంది. ఇన్ సైడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రాజమౌళి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నాడట.