సీఎంతో భేటీ సంతృప్తినిచ్చింది – చిరంజీవి

Chiranjeevi Expresses Satisfaction on Meeting with AP CM YS Jagan Mohan Reddy, Chiranjeevi To Meet AP CM YS Jagan Today, Chiranjeevi To Meet AP CM YS Jagan Today at Tadepalli Camp Office, Jagan Chiranjeevi Meeting, Jagan Chiranjeevi Meeting News, Jagan Chiranjeevi Meeting Updates, Latest News on jagan meeting, Mango News, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Expresses Satisfaction on Meeting with AP CM YS Jagan Mohan Reddy, Megastar Chiranjeevi Meet AP CM YS Jagan, Megastar Chiranjeevi meet CM Jagan, New GO on ticket rates is expected soon, Tadepalli Camp Office, Tollywood actor Chiranjeevi to meet YS Jagan

మరో 10 రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన జీవో ఇస్తామని సీఎం చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చ సంతృప్తినిచ్చిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. సినీ పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎంతో చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్ తిరుగుప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం చేయకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

“ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను ఓ సోదరుడిగా భావించి పండగ వేళ భోజనానికి ఆహ్వానించి నాతో అప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతి గార వడ్డించటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు సీఎం దంపతులిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా సందిగ్ధం ఉంది. ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో.. సీఎం గారు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించారు. ఆయన నాపై పెట్టిన సమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ తొందరపడి మాటలు జారొద్దని కోరుతున్నాను అని అన్నారు చిరంజీవి. సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది. అలాగే మరోవైపు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా సీఎంతో చర్చించా. థియేటర్ల సమస్యలు.. ఇంకా ఎగ్జిబిటర్ల సమస్యలను కూడా ప్రస్తావించాను. ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం అని అన్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ సానుకూలమవుతాయని.. అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు చిరంజీవి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =