కివీస్ ను కట్టడి చేయాలంటే ఇలా చేయాల్సిందే..

To Tie Kiwis You Have To Do This, Tie Kiwis, Ind Vs New Zeland, Mumbai Wankhede Stadium, Third Test, To Tie Kiwis, You Have To Do This, Team India, WTC, Final, New Zeland Won, Border Gavaskar Trophy, Chinnaswamy Stadium, Icc Test World Championship, Ind Vs Nz, Ind Vs Nz Test Series, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu

న్యూజిలాండ్‌తో ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. బెంగళూరు, పుణె వేదికగా జరిగిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌పై గెలిచిన పర్యాటక న్యూజిలాండ్ జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మిగిలింది ఒక్క మ్యాచ్ మాత్రమే. కనీసం స్వదేశంలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అంతే కాదు ఆ విజయం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాలనే ప్రయత్నాన్ని సజీవంగా ఉంచుకోవాలని టీమ్ ఇండియా కృతనిశ్చయంతో ఉంది.

కాగా, కివీస్‌తో మూడో టెస్టు మ్యాచ్‌ ముంబై వేదికగా జరగనుంది. అక్కడి వాంఖడే స్టేడియంలో. ఈ మ్యాచ్ 1 నుంచి 4 వరకు జరగనుంది. పిచ్ పరిస్థితి ఎలా ఉంది, గతంలో ఈ రెండు జట్లు ఆడినప్పుడు పిచ్ ఎలా ప్రవర్తించింది. అనే అంశాలు ఇప్పుడు అందరి మదిలో కలుగుతున్న ఆలోచనలు. ప్రస్తుతం మూడో టెస్టుకు సిద్ధమవుతున్న వాంఖడే స్టేడియం పిచ్ బిట్ ఉన్నట్లు సమాచారం. దానిపై పలుచని గడ్డిని పెంచుతారు. దాని నుండి మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇది పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించనుంది. అయితే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత పిచ్ ఫీచర్లు మారే అవకాశం ఉంది.

మొదటి రోజు ఆటలో, పిచ్‌పై పచ్చిక దాదాపు పోతుంది, నేల కూడా వదులుగా ఉంది. అది మ్యాచ్ రెండో రోజుపై ప్రభావం చూపుతుంది. రెండో రోజు నుంచి పిచ్ నుంచి స్పిన్నర్లకు సాయం అందుతుంది. భారత్ టాస్ గెలిస్తే, మొదటి రోజు బ్యాటింగ్‌కు దిగి, ఎక్కువ వికెట్లు కోల్పోకుండా 300 నుండి 350 పరుగులు చేస్తే మంచిది. ఆ తర్వాత రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించి భారీ స్కోర్ సాధిస్తే మ్యాచ్ లో పట్టు సాధించవచ్చు. ఆ తర్వాత, న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్పిన్నర్లకు అనుకేలించే పిచ్ పై వారు టీమిండియా స్పిన్నర్లు చెలరేగే అవకాశముంది. రవిచంద్రన్ అశ్విన్ మరియు వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లకు ఈ పిచ్ చక్కగా సరిపోతుంది.

2021లో ఈ రెండు జట్లు ఇదే స్టేడియంలో తలపడ్డాయి. అప్పుడు కూడా పిచ్ ఇలాగే ప్రవర్తించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్లకు 276 పరుగులు చేసి 349 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలో దిగిన న్యూజిలాండ్ 167 పరుగులకు ఆలౌటై భారత్‌పై 172 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.