మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా యూపీఐ మారిపోయింది. ఈ క్రమంలో యూపీఐకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు నవంబర్ 1, 2024 నుండి యూపీఐ లైట్ లో మార్పులు జరగనున్నాయి. దీని కారణంగా చిన్న చెల్లింపులు మరింత సులభతరం అవుతాయి. రిజర్వ్ బ్య UPI లైట్ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీల పరిమితిని పెంచుతుందని, ఆటో టాప్-అప్ ఫీచర్‌ను జోడిస్తుందని ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్లు UPI లైట్ వినియోగదారులకు మరింత సౌలభ్యంతో, అంతరాయం లేకుండా చెల్లింపులు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.
UPI లైట్ అనేది డిజిటల్ వాలెట్. ఇది UPI PIN లేకుండా చిన్న లావాదేవీలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఆటో-టాప్-అప్ ఫీచర్ పరిచయంతోమనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లైట్ వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఈ మార్పుల ద్వారా వినియోగదారులు మునుపటి కంటే UPI లైట్ ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయగలుగుతారు. UPI లైట్ లావాదేవీ పరిమితిని RBI పెంచింది. అదే సమయంలో UPI లైట్ బ్యాలెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉంటే వినియోగదారు ఖాతా ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా టాప్-అప్ అవుతుంది. దీంతో యూపీఐ లైట్ ద్వారా ఎలాంటి పరిమితి లేకుండా చెల్లింపులు చేయవచ్చు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్‌కు చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్. ఇది ఒక వ్యాలెట్‌లా పనిచేస్తుంది. దీంతో చేసే చెల్లింపులకు పిన్ అవసరం లేదు. దీనిలో గరిష్ఠంగా రూ.2000 వరకు లోడ్ చేసుకోవచ్చు. రూ.500కన్నా తక్కువ పేమెంట్‌ను యూపీఐ పిన్ లేకుండా పంపొచ్చు. అయితే నవంబరు 1 నుంచి వినియోగదారుడి యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి.
ఆటో టాప్-అప్ ఫీచర్: కొత్త ఆటో టాప్-అప్ ఫీచర్ నవంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. UPI లైట్ వాలెట్ బ్యాలెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి దాని స్వంత వాలెట్‌ను రీఛార్జ్ చేస్తుంది. దీనితో వినియోగదారులకు మాన్యువల్ రీఛార్జ్ అవసరం ఉండదు. వారి చెల్లింపులకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి.