8 గంటలు కూర్చుని కాదు.. నిలబడే పని చేస్తామంటోన్న ఉద్యోగులు

Employees Who Says That They Will Work Standing For 8 Hours Instead of Sitting,Employees Instead of Sitting,Employees Will Work Standing For 8 Hours,Employees Who Says That They Will Work Standing,Mango News,Mango News Telugu,Demand for standing desks, standing desks,will work standing for 8 hours,Apple Company,Changes in lifestyle,Swelling of the legs,Distracted posture,Employees life style,Apple Company standing desk,Apple employees to stand at work,Employees to stand at work News Today,Employees to stand at work Latest News,Employees to stand at work Latest Updates

కొద్ది రోజులుగా ఉద్యోగుల ఆలోచనలు మారుతున్నాయి. కరోనా తర్వాత ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా వల్ల కోలుకోలేని ఆరోగ్యం ఓ వైపు వేధిస్తుండటం.. అప్పటి నుంచి మనుష్యుల జీవనశైలిలోనూ మార్పులు (Changes in lifestyle) రావడంతో శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ అయిపోతున్నారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ తర్వాత కార్పొరేట్‌ ప్రొఫెషనల్స్ చాలామంది వెన్నునొప్పి (back pain)తో బాధపడ్డారు. దీంతో తిరిగి ఆఫీసులకు వచ్చినా 8 గంటలు కూర్చుని పనిచేయడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీంతో స్టాండింగ్‌ పొజిషన్‌లో చేసే వర్క్‌పై రాను రాను ఆసక్తి పెరుగుతోంది. కూర్చోవడం కంటే నిల్చుని పని చేయడానికే ఉద్యోగులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో స్టాండింగ్‌ డెస్క్‌లకు డిమాండ్‌ (Demand for standing desks) పెరిగిపోతోంది.

కూర్చుని చేయడం కంటే నిలబడి చేసేవారికి వెన్నునొప్పి (back pain), నడుము కింద భాగాన నొప్పి, కాలు నొప్పులు (Leg pain), కాళ్ల వాపులు (Swelling of the legs) వంటి ఇబ్బందులు తగ్గినట్లు ఉద్యోగులు ఫీలవుతున్నారు. దీనికి తోడు ఒక ఎక్స్పీరియన్స్‌‌ను ఫేస్ చేస్తున్న ఫీలింగ్‌లో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఎక్కువ టైపింగ్ చేసే జాబులు చేసేవాళ్లు దీనిని ఇష్టపడినా టైప్ చేయడానికి ఇదంతా సౌకర్యవంతంగా లేకపోవడంతో వాళ్లు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. అయితే ఇలా స్టాండింగ్ పొజిషన్ ఆప్షన్ ఇస్తున్న కంపెనీలు.. స్టాండింగ్ అండ్ సిట్టింగ్ పొజిషన్లను రెండూ ఆఫర్ చేస్తోంది. దీంతో ఎవరికి నచ్చినట్లు వాళ్లు పనిచేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రొడెక్టవిటీ కూడా ఏం తగ్గడం లేదని, ఉద్యోగులంతా కొత్త ఉత్సాహంతో చేస్తున్నారని కంపెనీ యజమానులు చెబుతున్నారు.

నిజానికి ఎక్కువ గంటలు అలా కూర్చుని పనిచేయడం స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువ టైము అలా కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు, కొన్ని రకాల క్యాన్సర్స్‌ వంటి సమస్యలు పెరుగుతాయి. అలా ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తున్నప్పుడు, మెదడుకు అందాల్సిన రక్త ప్రసరణ సరిగ్గా అందదు. ఇది డెమన్షియా (Dementia) వంటి జబ్బు రావడానికి దారితీస్తుంది. అదే మనిషి నిలబడి ఉన్నప్పుడు.. మెదడుకు అందాల్సిన రక్త ప్రసరణ పెరగడంతో పాటు.. దానికి అవసరమైన ఆక్సిజన్‌, ఇతర పోషకాలను కూడా అందిస్తుంది. అంతేకాదు చాలా సేపు కూర్చోవడం వల్ల మనకు తెలీకుండానే అలసట, బద్ధకం వచ్చేస్తాయి. ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడం వల్ల వెన్నునొప్పికి వస్తుంది.

కానీ నిలబడి చేస్తే రకరకాల పొజిషన్లో మారి పని చేస్తారు. అందుకే నిలబడి పని చేసిన వాళ్లలో ఈ సమస్యలేమీ కనిపించడం లేదని వైద్యులు అంటున్నారు. అదే నిలబడి పనిచేస్తే.. మరింత చురుకుగా పని చేస్తారు. కోర్ కండరాలకు సపోర్ట్ ఉండటం వల్ల వెన్ను నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలా కంపెనీలు స్టాండింగ్ డెస్క్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. యాపిల్ కంపెనీ (Apple Company) కూడా తన కొత్త ఆఫీస్‌లో స్టాండింగ్ డెస్కులను ఏర్పాటు చేసిందట. అయితే ఒంగిన భంగిమ కానీ, అపసవ్య పొజిషన్ (Distracted posture)లో కానీ నిలబడి పనిచేస్తే అది కొత్త సమస్యలను దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్క్‌పై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మోచేతులు 90-డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతేకాదు అరగంటకు ఓసారి నిలబడే పొజిషన్‌ను మార్చాలని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =