అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు. ఈ నెల 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న హిందువుల ఓట్లపై ఇరు పార్టీల కన్ను పడింది. భారతీయులకు దీపావళి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ విషెస్ తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా జరుపుకొనే దీపాల పండగ అని అభివర్ణించారు.
ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే తమ దేశంలో నివసించే హిందువుల హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. రాడికల్ భావజాలం ఉన్న వాళ్లు, హిందూయిజాన్ని వ్యతిరేకించడమే తమ అజెండా పెట్టుకున్న వాళ్ల నుంచి అమెరికన్లలో హిందువులను కాపాడతానని అన్నారు. 2016 నుంచి 2019 వరకు తన పాలనలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించానని, ప్రధాని మోదీ తనకు నమ్మకస్తుడైన మితృడని కితాబిచ్చారు. బంగ్లాదేశ్ మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడిని అనాగరిక చర్యగా పేర్కొన్నారు.
ఇక, ఇజ్రాయెల్ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఎన్నో విపత్తులు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేస్తామన్నారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తామన్నారు. నా పరిపాలనతో భారత్ తో పాటు ప్రధాని మోడీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని ఆయన వెల్లడించారు. అలాగే, హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలను దెబ్బ తీస్తుంది.. నేను గెలిస్తే అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతాను అన్నారు.