కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

YS Sharmila Meets Karnataka Deputy CM DK Shivakumar in Bengaluru Amid Speculations of Alliance Between Congress and YSRTP,YS Sharmila Meets Karnataka Deputy CM,Deputy CM DK Shivakumar in Bengaluru,Speculations of Alliance Between Congress and YSRTP,Alliance Between Congress and YSRTP,YS Sharmila Alliance Between Congress,Mango News,Mango News Telugu,YS Sharmila,YS Sharmila applauds DK Shivakumar,YSRTP Cheief YS Sharmila,YS Sharmila Latest News,YS Sharmila Latest Updates,YS Sharmila Live News,Karnataka Deputy CM DK Shivakumar Latest News

కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలుసుకున్నారు. సోమవారం బెంగళూరులోని శివకుమార్‌ ఇంటికి వెళ్లిన షర్మిల ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఇటీవలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆయనతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు షర్మిల అభినందనలు తెలిపారు. అయితే తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌టీపీకి పొత్తు ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ భేటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఏడాది చివర్లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాంలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలను రచించే పనిలో పడింది. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే తెలంగాణలో పర్యటించి తొలి బహిరంగ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక త్వరలో ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలు అందుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని అంటున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ విలీనం? లేక పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఈ పరిణామాల మధ్య వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఈరోజు బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న డీకే శివకుమార్‌ను షర్మిల కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని, ఈ భేటీకి అంతకుమించి విశేషం ఏమీ లేదని వైఎస్సార్‌టీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here