భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్‌..! ఫిబ్రవరిలో కచ్చితంగా తీసుకువస్తామంటున్న నాసా

Sunita Williams Is Coming Back To Earth

కొన్నినెలలుగా భారతీయ అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌తో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌విల్మోర్‌, నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌.. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్రూ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి చేరుకోనున్నట్లు నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ స్పేస్‌షిప్‌ భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గం. 5.05 నిమిషాలకు ఐఎస్‌ఎస్‌ హార్మోనీ మాడ్యూల్‌ ముందు పోర్ట్‌ నుంచి అన్‌డాక్‌ అయ్యి.. ఆటోమేటిక్‌గా మాడ్యూల్‌ స్పేస్‌ ఫేసింగ్‌ పోర్ట్‌కి చేరుతుంది.

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్‌ 5వ తేదీన బోయింగ్‌ స్టార్‌లైన్‌ స్పేస్‌షిప్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ తిరిగి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకు రావడానికి నాసా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూనే ఉంది.

తాజాగా ఫిబ్రవరి 2025లో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌విల్మోర్‌ ను తిరిగి భూమికి తీసుకురానున్నట్లు నాసా పేర్కొంది. దీని కోసం స్పేస్‌ ఎక్స్‌కు చెందిన కార్గో వెర్షన్‌ని ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్‌ నాసా 31వ కమర్షియల్‌ రీసప్లై సర్వీసెస్‌ మిషన్‌గా పిలుస్తారు. ఈ రీసప్లై సర్వీసెస్ మిషన్ కింద సౌర గాలి, రేడియేషన్, స్పేస్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్‌పై ప్రయోగాలు చేయబోతున్నారు.