ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారు

Biden to host first in-person Quad Leaders Summit, Mango News, Modi to Visit USA, PM Modi, PM Modi To Attend Quad Summit in Washington, PM Modi to visit US to attend first in-person Quad Leaders, PM Modi to Visit USA, PM Modi to Visit USA for Quad Leaders’ Summit, PM Modi to Visit USA for Quad Leaders’ Summit and UNGA High-level Segment, PM Modi to Visit USA for Quad Leaders’ Summit and UNGA High-level Segment on Sep 24 25, Prime Minister’s Visit to USA for Quad Leaders’ Summit

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 24, 25 తేదీలలో రెండు రోజుల పాటుగా ప్రధాని మోదీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 24న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగే క్వాడ్రిలేటరల్ ఫ్రేమ్‌వర్క్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బిడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 12, 2021న క్వాడ్‌ నేతల మధ్య జరిగిన మొదటి వర్చువల్ సమ్మిట్ నుండి సాధించిన పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే భాగస్వామ్య ఆసక్తి ఉన్న ప్రాంతీయ సమస్యలపై నలుగురు నాయకులు చర్చించనున్నారు.

ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, వారు ఈ సంవత్సరం మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌ పై సమీక్ష జరుపుతారు. ఇక క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలిజీఎస్, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, సముద్ర భద్రత, మానవతా సహాయం/విపత్తు ఉపశమనం, వాతావరణ మార్పు మరియు విద్య వంటి సమకాలీన ప్రపంచ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకోనున్నారని తెలిపారు.

మరోవైపు సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్ లో ఉన్నత-స్థాయి విభాగం యొక్క జనరల్ డిబేట్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సంవత్సరం జనరల్ డిబేట్ యొక్క థీమ్ ను కోవిడ్-19 నుండి కోలుకోవడం, నిలకడగా పునర్నిర్మించడం, ప్లానెట్ యొక్క అవసరాలకు ప్రతిస్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం మరియు ఐక్యరాజ్య సమితిని పునరుజ్జీవింపజేయడం వంటివిగా నిర్ణయించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =