భారతీయులకు ట్రంప్ షాకిస్తారా? గ్రీన్ కార్డులు ఇక అందని ద్రాక్షేనా?

Will Trump Shock Indians, Trump Shock Indians, Trump To Surprise Indians, Are Green Cards, Green Card, Donald Trump, India, Visa, President Of The United States, US Elections, America, Kamala Harris, Donald Trump, USA, America Elections, US Elections 2024, US Political News, Political News, Mango News, Mango News Telugu

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. భారతదేశం నుంచి అమెరికాకు ఏటా లక్షల్లో జనం ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్తుంటారు. వారిలో కొంతమంది అక్కడే స్థిరపడి గ్రీన్ కార్డులు కూడా పొందుతారు.

గ్రీన్ కార్డు అనేది అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎంతో మంది కనే కల. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు. అయితే ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ తీసుకోనున్న ఈ నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

డొనాల్డ్ ట్రంప్ మొదట్నుంచీ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలంటూ ట్రంప్ తన వాదన మొదలుపెట్టారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్..ఇతర దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై కన్నేశారు. గ్రీన్ కార్డు రూల్స్ మార్చడానికి ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డు పొందితే ..వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా సిటిజన్ షిప్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే ట్రంప్ స్వస్తి పలకడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డు నిబంధనలు ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు అయి ఉండాలి లేదా చట్టబద్దంగా శాశ్వత నివాసి అయి ఉండాలి. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కునే అవకాశం ఉందని అమెరికాలోని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గ్రీన్ కార్డు నిబంధనల్లో తీసుకువచ్చే మార్పుల వల్ల 10లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ లో చిక్కుకోవడంతో.. ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని.. సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.