భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేసారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సిజేఐ జస్టిస్ డి. వై . చంద్రచూర్ పదవీకాలం కాలం ఆదివారం ముగియడంతో సంజీవ్ ఖన్నా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర, మాజీ సిజేఐ డి. వై . చంద్రచూర్ తదితరులు పాల్గొన్నారు.
1960 మే 14 న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించిన 3వ న్యాయమూర్తి ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా. తండ్రి దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్. ఆర్. ఖన్నా సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ పదవిలో 2025 మే 13 వరకు కొనసాగుతారు. 18 జనవరి 2019 నుండి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సజీవ ఖన్నా, ఈ ఆరేళ్లలో 117 తీర్పులు రాశారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ, ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ, 456 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆ మధ్య దుమారం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలుకు బెయిల్ మంజూరు చేసారు.
ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, 1983లో దిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ట్యాక్సేషన్, ఆర్బిట్రేషన్, కమర్షియల్, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్ 25న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు, ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా, క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ అమకస్ క్యూరీగా పనిచేసారు.