ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్‌ మంజూరు

Delhi Liquor Scam Case Gorantla Buchibabu Former Auditor Of Mlc Kavitha Granted For Conditional Bail,Delhi Liquor Scam Case,Gorantla Buchibabu,Former Auditor Of Mlc Kavitha,Buchibabu For Conditional Bail,Gorantla Buchibabu Liquor Scam Case,Mango News,Mango News Telugu,Excise Policy Case,Big Relief For Former Ca Buchibabu,Delhi Latest News And Updates,Delhi Live News,Delhi Liquor Scam Case Latest News

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు, రూ.2 లక్షల పూచీకత్తుతో పాటు ఆయన పాస్ పోర్ట్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ఫిబ్రవరి 8న అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అదేరోజున సీబీఐ బుచ్చిబాబును ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగించింది.

ఈ నేపథ్యంలో బుచ్చిబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గత బుధవారం కోర్టు ముందుకు విచారణకు రాగా, వాదనలు విన్న ప్రత్యేక జడ్జి తీర్పును వాయిదా వేశారు.అయితే గురువారం సదరు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో నేడు బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం. అలాగే ఏపీ నుంచి ఇటీవల ఒంగోలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి అరెస్టయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =