ఢిల్లీ టూర్ లో బిజీ బిజీ గా ఉన్న కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లే టార్గెట్ గా ట్వీట్ చేసిన కేటీర్ఆ త్వరలోనే ఆ ఇద్దరి పదవులు పోవడం ఖాయమన్నారు. ఇప్పటివరకు అధికార దుర్వినియోగం చేసిన చాలా మంది పదవులు కోల్పోయారని సోనియా పేరును కోల్పోయారని ఉదహరించారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ లో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయని, RR ట్యాక్స్ ఉందని మోదీనే అంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఈ సందర్బంగా కేటీఆర్ నిలదీశారు.
ఇక అమృత్ 2.0 ప్రాజెక్టులో భాగంగా తెలంగాణకు కేటాయించిన పనుల్లో 11 వందల 37 కోట్లు రూపాయల పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావ మరిది సుజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి అప్పగించారని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం దగ్గర బయటపెట్టేందుకే తాను ఢిల్లీ వచ్చానని చెప్పారు. తెలంగాణ కేటాయింపుల్లో అక్రమాలు జరిగితే ఢిల్లీలో బయటపెడతానని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లి కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి టెండర్లను రద్దు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులో ఇంత పెద్ద అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. అయితే మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీ పెద్దల పిలుపు మేరకే హస్తినకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం మహరాష్ట్రకు చేరుకుంటారు రేవంత్ రెడ్డి. మరి కేటీఆర్ ఆరోపణలపై ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.