రెహమాన్ ,సైరాభాను విడాకులు.. రెహమాన్ ఎమోషనల్ ట్వీట్

Rahman And Saira Bhanu Divorce, AR Rahman Divorce, Rahman Tweet, AR Rahman, Film Industry, Rahman Saira Bhanu Divorce, Rahman’s Emotional Tweet, Ram Charan, Saira Bhanu, Vandana Shah, AR Rahman Divorce News, Bollywood, Bollywood News, Bollywood Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలోని ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్న జంటల సంఖ్య ఎక్కువయిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కొంతమంది కూడా తమ పర్సనల్ రీజన్స్ వల్ల తమ బంధానికి ముగింపు చెబుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. తాము అభిమానించే జంట విడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలియక అయోమయంలో పడుతున్నారు.

తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, సైరా భాను విడిపోయినట్లు వారి లాయర్ వందనా షా మంగళవారం అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఇప్పుడు రెహమాన్, సైనా భాను విడాకుల వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు ఏఆర్ రెహమాన్ ఎక్స్ వేదికగా విడాకులపై స్పందిస్తూ ..ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాలు దేవుడిని కూడా ప్రభావితం చేస్తాయి. కానీ పగిలిన ముక్కలు మళ్లీ యథావిధిగా అతుక్కోలేవు. అయినా కూడా మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని రెహమాన్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు రెహమాన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఖతీజా, రహీమ్, అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రెహమాన్, సైరాభానుకు వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోవడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు.

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులతో పాటు, సాధారణ ఆడియన్స్ లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి.