ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ, టిక్కెట్ల ధరల వివరాలు ఇవే

AP Government Issues A New GO on Movie Ticket Prices Today, AP Government Issues A New GO on Movie Ticket Prices, A New GO on Movie Ticket Prices, A New GO on Cinema Ticket Prices, A New Government Order On Movie Ticket Prices, A New Government Order On Cinema Ticket Prices, Movie Ticket Prices In AP, AP Movie Ticket Prices, Movie Ticket Price, Movie Ticket, Cinema Ticket Prices, Cinema Ticket, Cinema Ticket Prices In AP, AP Cinema Ticket Prices, Movie Ticket Prices, Movie Ticket Prices Latest News, Movie Ticket Prices Latest Updates, Movie Ticket Prices Live Updates, Ticket Price issue, Movie Ticket Issue, Cinema Ticket Issue, movie tickets, Tollywood Live Updates, Tollywood News, Movie News, Movie Updates, Mango News, Mango News Telugu,

సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి సోమవారం నాడు ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా, కమిటీ పలుమార్లు సమావేశమై ధరలపెంపుపై నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వం ఆమోదించింది.

టికెట్ ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజన చేస్తూ, నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టీ ఫ్లెక్సీల వారీగా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. థియేటర్ల నిర్వాహణ, ఆన్లైన్ సర్వీస్ చార్జీలను టికెట్ ధర లోనే కలపగా, జీఎస్టీ అదనంగా ఉండనుంది. మరోవైపు హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు విడుదల తేదీ నుండి కనీసం పది రోజులు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరుపుకున్న హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే రేట్లు పెంపుకు అవకాశం ఉంది. హై బడ్జెట్ సినిమాలకు మొదటి 10 రోజులకు ప్రభుత్వం ప్రత్యేక టికెట్ రేట్లను ప్రకటించనుంది. అలాగే కొన్ని షరతులతో ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. హై బడ్జెట్‌ సినిమాలతో చిన్న సినిమాలకు క్లాష్ వచ్చినపుడు పండగ రోజులతో సహా ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక ఆట తప్పనిసరిగా చిన్న సినిమాని ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రొడక్షన్ కాస్ట్, నటుల రెమ్యునరేషన్స్ తో కలుపుకుని 20 కోట్ల బడ్జెట్ కంటే తక్కువుంటే చిన్న సినిమా/లో బడ్జెట్ కింద పరిగణించనున్నారు.

గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ ధరలపై సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని, అలీ తదితరులు ఇటీవలే సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సినిమా టిక్కెట్ల ధరలపై జీవో జారీ చేస్తామన్నారని చెప్పారు. అన్నట్లుగానే ఈరోజు దీనిపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం టిక్కెట్ల రేట్లు ఇలా ఉన్నాయి..

ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అనుమతి వివరాలివే:
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో:
  • నాన్-ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 40, ప్రీమియం: Rs. 60
  • ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 70, ప్రీమియం: Rs. 100
  • స్పెషల్ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs.100, ప్రీమియం: Rs. 125
  • మల్టీప్లెక్స్ థియేటర్స్: రెగ్యులర్ సీట్స్: Rs. 150, స్పెషల్ సీట్స్: Rs. 250
మున్సిపల్ పరిధిలో:
  • నాన్-ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 30, ప్రీమియం: Rs. 50
  • ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 60, ప్రీమియం: Rs. 80
  • స్పెషల్ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 80,  ప్రీమియం: Rs. 100
  • మల్టీప్లెక్స్ థియేటర్స్: రెగ్యులర్ సీట్స్: Rs. 125 , స్పెషల్ సీట్స్: Rs. 250
నగర్ పంచాయతీలు/గ్రామ పంచాయతీలు పరిధిలో:
  • నాన్-ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 20, ప్రీమియం: Rs. 40
  • ఏసీ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 50, ప్రీమియం: Rs. 70
  • స్పెషల్ థియేటర్స్: నాన్ ప్రీమియం: Rs. 70, ప్రీమియం: Rs. 90
  • మల్టీప్లెక్స్ థియేటర్స్: రెగ్యులర్ సీట్స్: Rs. 100, స్పెషల్ సీట్స్: Rs. 250.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 7 =