గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’పై అంచనాలు అశేషంగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని అంచనా వేయలేనంత భారీగా ప్రమోట్ చేస్తున్న చిత్రయూనిట్, ఇటీవలే ఓ సెన్సేషనల్ వార్తను ప్రకటించింది.
‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 21న అమెరికాలో అత్యంత భారీగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. కర్టిస్ కర్వెల్ సెంటర్, గార్‌లాండ్, టెక్సాస్ లో ఈ వేడుక జరుగనుండగా, ఇందులో చిత్రయూనిట్ మరియు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్, యూఎస్ లో ఇప్పటి వరకు నిర్వహించిన ఏ ఇతర సినిమా ఈవెంట్ కంటే పెద్దదిగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఈ విప్లవాత్మక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి నిర్వహించబోతున్నారు. రామ్ చరణ్ పై అభిమానంతో ఈ భారీ వేడుకను ఆర్గనైజ్ చేస్తున్న రాజేష్, ఈ ప్రాజెక్ట్ కోసం కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్ చరణ్, రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు, సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.