సలార్‌లో కనిపించిన ఖాన్సార్ నిజంగానే ఉందా ?

Is The Khansar Seen In Salar Really There, Khansar Seen In Salar, Khansar In Salar Really There, Khansar City Shown In The Movie Salaar Is, Khansar City, Salaar, Where Is Khansar City, Prabhas, Prasanthneel, Khansar, Latest Salar News, Salar News Updates, Prbhas, Mango News, Mango News Telugu
Khansar City Shown In The Movie Salaar Is,Khansar City,Salaar, where is Khansar City, Prabhas, Prasanthneel

ప్రభాస్ నటించిన సలార్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఖాన్సార్ సిటీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సలార్ స్టోరీ అంతా ఖాన్సార్  చుట్టూనే  తిరుగుతుంది. నిజంగానే ఈ నగరం  భారతదేశంలో ఉందా? లేక కేవలం సినిమా కోసమే దీనిని క్రియేట్ చేసారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్‌పై  ప్రేక్షకులు వీరిద్దిరిపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దీంతోనే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సలార్ గురించి వేరే లెవెల్‌ లో ఊహించుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ సలార్‌ను ప్రేక్షకుల ముందుంచారు.

ఈ మూవీలో స్టోరీ  మొత్తం ఖాన్సార్ అనే సిటీ చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఖాన్సార్ సిటీ  పాకిస్తాన్-గుజరాత్ మధ్య ఉందని  చూపించారు.దీంతో  నిజంగానే ఈ సిటీ ఉందా అని అభిమానులు గూగుల్‌లో దీని గురించి తెగ వెతుకుతున్నారట. అయితే నిజంగానే  ఖాన్సార్  పేరుతో సిటీ ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది.  కాకపోతే అది సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్-గుజరాత్ మధ్య కాకుండా ఇరాన్‌లో ఉందట.

ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఖాన్సార్ ఉంది.  ఖాన్సార్‌లో 22 వేలమందికి  పైగానే  పర్షియన్లు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే సలార్  సినిమాలో చూపించిన ఖాన్సార్‌కి.. ఇరాన్‌లో ఉన్న నిజమైన ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదట. మొత్తానికి సలార్ సినిమా రిలీజయ్యాక  ఈ ఖాన్సార్ సిటీ తెర మీదకి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =