MCLR: లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా టాప్ 5 బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తెలుసుకోండి!

మీరు పర్సనల్ లోన్ లేదా హోం లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే వడ్డీ రేట్లు, వాటి ప్రభావం గురించి పూర్తి అవగాహన అవసరం. పర్సనల్ లోన్లకు రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి: ఫ్లోటింగ్ రేట్లు మరియు ఫిక్స్‌డ్ రేట్లు.

ఫ్లోటింగ్ రేట్లు: బ్యాంకు వడ్డీ రేట్లను మారిస్తే, ఈఎంఐ లేదా టెన్యూర్ కూడా మారుతుంది.
ఫిక్స్‌డ్ రేట్లు: వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి, బ్యాంకు మార్పులు చేసినా దానికి ప్రభావం ఉండదు.
ఇక బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయించే సమయంలో ఎంసీఎల్ఆర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) అనేది బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే పద్ధతి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్లు ఇవ్వలేవు. అధికంగా కన్స్యూమర్ లోన్లు ఏడాది ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి.

ఇటీవల, RBI రెపో రేటు మార్పులతో అనుసంధానంగా, బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్‌ను సవరించాయి.

టాప్ 5 బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ రేట్లు (నవంబర్ 2024)

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)
ఓవర్‌నైట్: 9.15%
1 నెల: 9.20%
3 నెలలు: 9.30%
6 నెలలు: 9.45%
1 ఏడాది: 9.45%
2-3 ఏళ్ల మధ్య: 9.50%

2. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
ఓవర్‌నైట్: 8.45%
1 నెల: 8.50%
1 ఏడాది: 9.10%

3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ఓవర్‌నైట్, 1 నెల: 8.20%
3 నెలలు: 8.55%
1 ఏడాది: 9.00%
2-3 సంవత్సరాలు: 9.05% – 9.10%

4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
ఓవర్‌నైట్: 8.30%
1 నెల: 8.35%
1 ఏడాది: 8.80%
2-3 సంవత్సరాలు: 9.25%

5. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)
ఓవర్‌నైట్: 8.75%
1 నెల: 8.80%
1 ఏడాది: 9.55%
మరియు 2-3 ఏళ్ల: 9.65%

ముఖ్యమైన విషయం
ఎంసీఎల్ఆర్ ప్రకారం, బ్యాంకులు వడ్డీ రేట్లను రెగ్యూలేట్ చేస్తాయి. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకుంటే, బ్యాంకు ఎంసీఎల్ఆర్ మార్పులతో మీ ఈఎంఐ కూడా మారవచ్చు. అందుకే, లోన్ తీసుకునే ముందు ఎంసీఎల్ఆర్ రేట్లు, మీకు అనుకూలమైన రుణ పథకం గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

మీ వడ్డీ రేట్లు ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఉంటే, తాజా అప్డేట్‌ల కోసం మీ బ్యాంకును సంప్రదించండి. సమగ్ర సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమే!