చలికాలంలో చర్మం పగులుతోందా.? కారణాలు, పరిష్కారాలు చిట్కాలు

Is Your Skin Cracking In Winter Causes Solutions Tips, Skin Cracking In Winter, Skin Cracking Solutions, Skin Cracking Tips, Winter Skin Cracking, Best Skin Care Tips, Skin Care, Diet Plan for Glowing Skin, Juice for Healthy Skin, Clear Skin, Juices for Glowing Skin, Anti Acne Diet, Health, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది, సాయంత్రం 5 గంటలకే చీకటిపడిపోతుంది. ఈ కాలంలో చర్మం పై వచ్చిన మార్పులు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. చలికాలంలో చర్మం పొడిబారడం, మెరుపును కోల్పోవడం, పెదవులు, ముఖం, కాళ్లు, చేతులు పగలడం అన్నీ సాధారణ సమస్యలు. ఈ సమయంలో మాయిశ్చరైజర్లు, కొబ్బరి నూనె వంటివి ఉపయోగించడం సాధారణమైన పరిష్కారాలు. అయితే చలికాలంలో చర్మం ఎందుకు మారుతుందో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

చలికాలంలో చర్మం పొడిబారే కారణాలు:
తేమ కోల్పోవడం: వాతావరణంలో చల్లిన గాలుల తీవ్రత పెరిగే సమయంలో, చర్మం నుండి సహజంగా తేమ తీసిపోతుంది. ఇది చర్మాన్ని పొడిబార్చుతుంది.

నీటిని తక్కువ తీసుకోవడం: చలికాలంలో మనం సాధారణంగా నీరు తాగడంలో నిర్లక్ష్యంగా ఉంటాం, ఇది డీహైడ్రేషన్‌ కు దారి తీస్తుంది. డీహైడ్రేషన్‌ వల్ల చర్మం పొడిబారిపోతుంది.

వేడి నీటితో స్నానం: వేడి నీటితో స్నానం చేయడం కూడా చర్మంలోని సహజ తేమను తీసిపోతుంది, దాంతో చర్మం పగులుతుంది.

విటమిన్ల లోపం: చలికాలంలో శరీరంలో విటమిన్ A, C, D లోపం కూడా చర్మాన్ని పొడిబార్చుతుంది.

ఎండ తక్కువగా ఉండటం: చలికాలంలో ఎండ తగ్గిపోతుంది. ఎండ కిరణాలు చర్మాన్ని రక్షించే గుణం కలిగి ఉండటంతో, వీటి కొరత చర్మానికి నష్టం కలిగిస్తుంది.

చర్మం పొడిబారకుండా ఉండటానికి నివారణ చర్యలు:
శనగపిండితో స్నానం చేయడం: సబ్బుల బదులుగా శనగపిండిని ఉపయోగించడం చర్మానికి సహజమైన స్మూత్‌నెస్ అందిస్తుంది. శనగపిండిలో పాలు కలిపి చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పెరుగుతో: పెరుగులో తేనె కలిపి చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం నిగారింపును పొందుతుంది.

వేడి నీటితో స్నానం చేయకూడదు: చల్లని వాతావరణంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయడం తేమను తీసి, చర్మం పొడిబారిపోతుంది. అప్పుడు గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.

కీరదోస తినడం: కీరదోస చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండడం, చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

అలోవెరా జెల్, పెట్రోలియం జెల్: ఈ జెల్లీలను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మంలో సహజ తేమ రక్షింపబడుతుంది, తద్వారా చర్మం పగిలిపోకుండా ఉండిపోతుంది.

పాలతో చర్మాన్ని రక్షించండి: పాలలో నానబెట్టిన దూదితో చర్మాన్ని చక్కగా చేయవచ్చు. ఇది చర్మాన్ని నిగారింపచేసి, దానిని పగులకుండా కాపాడుతుంది.

కొబ్బరినూనె: కొబ్బరినూనె చర్మానికి మేలు చేస్తుంది. దీనిలో ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మృదుత్వాన్ని, తేమను అందిస్తాయి. స్నానానికి అరగంట ముందు కొబ్బరినూనె రాసుకోవడం చర్మాన్ని కాపాడుతుంది.

తేనే : చలికాలంలో చర్మం పొడిబారినప్పుడు, తెనే రాసుకోవడం వలన చర్మం మరింత సున్నితంగా మారుతుంది మరియు సహజ నిగారింపును పొందుతుంది.

మరిన్ని జాగ్రత్తలు:
నీరు తాగండి:చలికాలంలో కూడా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరానికి కావలసిన నీరు అందించడం ద్వారా చర్మం పగిలిపోకుండా కాపాడవచ్చు.

అధిక ప్రోటీన్‌ ఆహారం: ప్రోటీన్‌ సంపూర్ణ ఆహారం తీసుకోవడం కూడా చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

చలికాలంలో చర్మం పొడిబారడం ఒక సాధారణ సమస్య అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. సరిగ్గా ఆహారం, మాయిశ్చరైజర్లు, సహజ పదార్థాలతో చర్మాన్ని కాపాడుకుంటే చలికాలంలో కూడా చర్మం మృదువుగా, సౌమ్యంగా ఉంటుంది.