పెరుగుతోన్న అండాశయ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలివే !

The Increasing Threat of Ovarian Cancer in Women Know The Symptoms,The Increasing Threat of Ovarian Cancer,Ovarian Cancer in Women,Know The Symptoms of Ovarian Cancer,Mango News,Mango News Telugu,Various cancers,ovarian cancer, The increasing threat of ovarian cancer in women, ovarian cancer symptoms, Cancer diagnosis,Awareness of ovarian cancer,Ovarian Cancer Risk Factors,Threat of Ovarian Cancer Latest News,Threat of Ovarian Cancer Latest Updates,Ovarian Cancer Latest News,Ovarian Cancer Latest Updates

ఇప్పుడు ప్రపంచమంతా క్యాన్సర్ (cancer) బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. హెరిడిటరీతో పాటు జీవనశైలి, ఆహారపుటలవాట్లు కారణంగా మహిళల్లో రకరకాల క్యాన్సర్లు (Various cancers) పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా భారత దేశంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ , అండాశయ క్యాన్సర్ వంటివి మహిళ్లలో పెరిగి ప్రాణాంతకంగా మారుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని.. కానీ చాలామంది మహిళలకు తమకు క్యాన్సర్ ఉన్నట్లు కూడా తెలియకపోవడమే బాధాకరమని అంటున్నారు. భారత్‌లో ఈ కేసుల సంఖ్య పెరగడంతో.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

అండాశయ క్యాన్సర్ లక్షణాలు

అండాశయ క్యాన్సర్ (ovarian cancer) అండాశయాలలో కణాలు నియంత్రణ లేకుండా పెరగపోవడం వల్ల వస్తుంది. ఈ కణాలు చాలా వేగంగా పెరుగుతాయి. పక్కన ఉన్న మిగిలిన ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసి.. నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ తీవ్రత (Cancer severity) ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్ నిర్ధారణ (Cancer diagnosis) లేటుగా తెలుస్తుంది. దీంతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఎక్కువ సంఖ్యలో కణాలు పాడయి ఉంటాయి. అయితే ముందుగా ఈ క్యాన్సర్‌ను కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో కటి ప్రాంతంలో, పొత్తి కడుపులో నొప్పి (Abdominal pain) లేదా తిమ్మిరి వస్తున్నట్లు ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో కణితి పెరగడం వల్ల పొత్తి కడుపు నొప్పి కూడా ఉంటుంది. అయితే పీరియడ్స్ టైమ్‌లో వచ్చిన నొప్పిలాగే ఉండటంతో చాలామంది మహిళలు పెద్దగా పట్టించుకోరు. అయితే రెగ్యులర్‌గా ఇలా పొత్తికడుపు నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సంబంధించిన డాక్టర్‌ను సంప్రదించాలి.

అంతేకాదు కొన్నిసార్లు మూత్ర విసర్జన అర్జంటుగా వెళ్లాలన్న పరిస్థితి ఉంటుంది. కానీ మూత్రం రాదు. కొన్నిసార్లు మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తుంటారు. అయితే డయాబెటిస్ లక్షణం అనుకుంటారు. అలాగే కడుపు నొప్పితో పాటు, వెన్నునొప్పి, సెక్స్ సమయంలో నొప్పి, మలబద్దక సమస్య, బరువు తగ్గడం, కడుపు ఉబ్బరంతో పాటు కాస్త తింటేనే పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి అకస్మాత్తు మార్పులు మహిళల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =