రామ్ చరణ్ ‘RC 16’లో కొత్త సర్ప్రైజ్! ‘మీర్జాపూర్’ ఫేమ్ మున్నా భయ్యా కీలక పాత్రలో!

Ram Charans RC 16 Gets A Big Surprise Mirzapur Fame Munna Bhai In A Key Role, Ram Charans RC 16 Gets A Big Surprise, Mirzapur Fame Munna Bhai In A Key Role, Munna Bhai Key Role In RC 16, RC 16 Munna Bhai In A Key Role, Divyendu Sharma, Mirzapur, Ram Charan, Telugu Cinema, Rc16, Thaman, Game Changer Telugu Movie, Game Changer, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘RC 16’ కోసం ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేతులు కలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మాణం అవుతుంది. అయితే ఈ చిత్రానికి తాజాగా వచ్చిన క్రేజీ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఉబ్బి తబ్బి పోతున్నారు.

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో ఇండియన్ వైడ్ క్రేజ్ సంపాదించిన నటుడు దివ్యేందు శర్మ, తెలుగులో తన డెబ్యూ చేయనున్నారు. ఆయన ‘RC 16’లో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దివ్యేందు ‘మీర్జాపూర్’లో మున్నా భాయ్ పాత్రతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు టాలీవుడ్‌లో రామ్ చరణ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఒక పెద్ద సంచలనమే.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో దివ్యేందు శర్మ పాత్ర ఎలా ఉంటుందనే విషయం ఇప్పటివరకు తెలియాదు. అయితే, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ విడుదలై, అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ‘RC 16’ ఒక పాన్ ఇండియా చిత్రంగా ప్లాన్ చేయబడింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ ఫేమ్ దివ్యేందు శర్మతో పాటు, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక, ‘RC 16’ ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2025లో ఈ చిత్రం విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్లలో బిజీ అయినా, ఈ సినిమాపై దృష్టి పెట్టడం మరో కీలక విషయంగా మారింది.