కోవిడ్ తర్వాత చాలామంది పండ్లను తినడం అలవాటుగా మార్చుకున్నారు. బయట దొరికే కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యే బదులు.. పండ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని డైలీ ఫ్రూట్స్‌ను తమ మెనూలో యాడ్ చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చాలామందికి తెలియదు.
శీతాకాలంలో దొరికే పండు బొప్పాయిలో పప్యెన్ అడే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయి డైజేషన్ సిస్టమ్‌ను మెరుగు పరచడంలో ముందుంటుంది. అలాగే బోన్‌హెల్త్, హార్ట్ హెల్త్, స్కిన్ హెల్త్‌ను కూడా మెరుగు పరుస్తుంది.
వేసవిలో ఎక్కువగా దొరికే పండు పుచ్చకాయ లేదా వాటర్ మిలాన్‌లో 80 శాతం నీరు ఉంటుంది. వాటర్ మిలాన్ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటంతో.. డీహైడ్రేషన్ సమస్య ఉండదు.అలాగే స్కిన్ హెల్త్‌ను బెటర్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు పుచ్చకాయను తింటే మంచిది.
చాలా మంది వైద్యులు రోజూ ఒక కూడా యాపిల్ తినాలని సూచిస్తారు. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొన్నిరకాల క్యాన్సర్ల నియంత్రణకు దోహదపడ్డాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే యాపిల్‌లో కొలెస్ట్రాల్, బీపీ, ఇన్ప్లమేషన్ను తగ్గి్ంచే గుణాలున్నాయి.
జామకాయల్లో ఉండే హై ఫైబర్ డైజెషన్ సిస్టమ్‌ను మెరుగు పరుస్తాయి. జామకాయలో అధిక మోతాదులో ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అన్ని పండ్లలో తక్కువ ధరకు దొరికే జామకాయను రెగ్యులర్ గా తింటే ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతూ ఉంటారు.
దానిమ్మ సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో కూడా దొరుకుతుంది. దానిమ్మపండును పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో.. బీపీని నియంత్రించడంలో ముందుంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవారు దానిమ్మ గింజలను రోజూ తింటే మంచిదని డాక్టర్లు చెబుతారు.