దక్షిణ కొరియా రాజకీయ వాతావరణం అశాంతికరంగా మారింది. దేశ బడ్జెట్ బిల్లుపై పార్లమెంటులో ఏకాభిప్రాయం రాకపోవడంతో, కమ్యూనిస్టు శక్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ సంచలనంగా ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు.
జాతీయ ప్రసంగంలో యూన్ ప్రజలతో మాట్లాడుతూ, “ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న కమ్యూనిస్టు బెదిరింపులను ఎదుర్కొనడం అత్యవసరం. పార్లమెంటు స్థంభించిపోవడం ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. అందుకే, దేశ రక్షణ కోసం ఈ చర్య తీసుకోక తప్పలేదు,” అన్నారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా మరియు యూన్ నేతృత్వంలోని పీపుల్స్ పవర్ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ వ్యయాల్లో కోత విధించాలన్న ప్రతిపక్షాల డిమాండ్లకు ప్రతిగా, యూన్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎమర్జెన్సీ తర్వాత దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని అంచనా.