ఘనంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం వివాహ వేడుకలో సెలబ్రెటీల సందడి..!

Naga Chaitanya And Shobhita Dhulipalas Wedding, Celebrities At The Wedding Ceremony, Naga Chaitanya Sobhita Wedding, Naga Chaitanya Wedding, Naga Chaitanya Shobhita Got Married, Naga Chaitanya Shobhita Wedding, Naga Chaitanya And Akhil To Get Married, Naga Chaitanya And Akhil Marriage, Naga Chaitanya And Akhil Wedding, Akhil, Akkineni Family, Akkineni Family Wedding, Naga Chaitanya, Nagarjuna, Wedding, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో గల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈరోజు రాత్రి 8 గంటల 13 నిమిషాలకి శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ, స్పోర్ట్స్ సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ వివాహ వేడుకలు కొనసాగగా. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి, సుహాసిని, అడివి శేష్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, చాముండేశ్వరినాథ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుక వద్ద అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబంతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి మండపం వద్ద సందడి చేశారు. చాలా పరిమిత సంఖ్యలో బంధువులతో పాటు సన్నిహితుల్ని నాగార్జున ఈ వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి కోసం..స్పెషల్‌‌గా ఒక సెట్‌ను అక్కినేని నాగార్జున వేయించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి సెట్‌ను ఏర్పాటు చేశారు.

ఇక త్వరలోనే అక్కినేని కుటుంబంలో మరో వివాహం కూడా జరగనుంది. అక్కినేని అఖిల్ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అఖిల్ పెళ్లిని కూడా నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఘనంగా జరిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు నాగచైతన్య నటించిన తండేల్ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు హీరోయిన్‌గా సాయి పల్లవి నటించింది.ఇక శోభిత ఎక్కువగా బాలీవుడ్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ వచ్చింది. రెండేళ్లు డేటింగ్ చేసిన శోభిత ఈ ఏడాది ఆగస్టులో చైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ్ల పెద్ద ప్రాజెక్ట్‌లు ఏవీ కూడా ఓకే చేయలేదు.