ప్రతీ ఒక్కరికి ప్రొటీన్ల అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రొటీన్లు లోపిస్తే ఎన్నో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ లోపం వల్ల సరిగ్గా పని చేసుకోలేకపోవడంతో పాటు..ఎన్ననో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే ప్రొటీన్ లోపం లేకుండా చూసుకోవాలి. అందుకే ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నామా? లేదా? మన శరీరంలో తగినంత ప్రొటీన్ లేదని ఎలా తెలుసుకోవాలి? బాడీలో సరిపోయేంత ప్రొటీన్ లేకపోతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు అంటున్నారు.
ప్రోటీన్ తగినంత లేకపోతే.. కండరాలు బలహీనంగా మారుతాయి. దీంతో బరువైన వస్తువులను ఎత్తడంలో ఇబ్బంది పడుతారు. అలాగే వర్కవుట్లు చేస్తున్నప్పుడు కండరాలు త్వరగా అలిసిపోయినట్టుగా ఫీలవుతారు. ఎక్కువ కష్టపడకపోయినా, కండరాలకు ఎక్కువగా ఒత్తిడి పెట్టకపోయినా కూడా త్వరగా అలిసిపోతారు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా ప్రొటీన్ లోపం వచ్చినట్టే. జుట్టు పల్చబడటం కూడా ప్రొటీన్ లోపమే. ప్రోటీన్ తక్కువగా ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.
అలాగే తరచుగా అంటువ్యాధుల బారిన పడుతున్నా..తరచుగా జలుబు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రోటీన్ లోపం ఉన్నట్లే. ప్రోటీన్ లోపం ఉన్నవారిలో శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. చిన్న కోతలు, గాయాలు వంటివి నయం కావడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది.
ప్రోటీన్ లోపం వల్ల మూడ్ స్వింగ్స్ గురవుతారు. మరింత చిరాకుగా, ఆత్రుతగా లేదా నిరుత్సాహానికి గురవడం వంటి లక్షణాలుంటాయి. చేతులు, పాదాలు లేదా చీలమండలలో వాపు కామన్ గా కనిపించొచ్చు. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత వాపులు ఎక్కువగా అనిపిస్తాయి. పెళుసుగా ఉండే నెయిల్స్ ప్రొటీన్ లోపాన్ని చూపిస్తాయి. అలాగే గోర్లు బలహీనంగా మారి,తేలికగా విరిగిపోవడం అవుతుంటాయి. ఈ సంకేతాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను లేదా నూట్రియనిస్టును సంప్రదించి.. మంచి ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి.