నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

Bad News For Non Veg Lovers, Non Veg Lovers Bad News, Non Veg Lovers, Dangerous To Eat More Non Veg, Bad News For Non Veg Lovers, Non Veg, Chicken, Mutton, Fish, Prawns, Health News, Health News Updates, Healthy Foods, Mango News, Mango News Telugu
dangerous to eat more non-veg?,Bad news for non-veg lovers ,non-veg, Chicken, Mutton, Fish, Prawns

చాలామంది వెజిటేరియన్ ఫుడ్ తినేవారి  కంటే నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు. అందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని ..అందువల్ల ఆరోగ్యంగా , బలంగా ఉంటారని భావిస్తారు. అందులోనూ ఫిష్, మటన్ కంటే ఎక్కువ మంది చికెన్‌ను ఎక్కువ ఇష్టంగా తింటారు.మరికొందరు అయితే రోజూ చికెన్‌ తమ మెనూలో ఉండేలా చూసుకుంటారు. కానీ చికెన్ ఎక్కువగా తింటే అనారోగ్యమని డాక్టర్లు చెప్పడంతో నాన్ వెజ్ ప్రియులు హర్ట్ అవుతున్నారు.

మాంసం ఎక్కువగా తింటే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలో తేలింది.  అలాగే గొడ్డు మాంసం, పంది, గొర్రె మాంసం తినడం వల్ల..వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు.  సాధారణంగానే నాన్ వెజ్ ఆహారాల్లో  కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని.. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు  చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలో మసాలాలు, కారం , నూనె వంటివి ఎక్కువ మోతాదులో వాడటం వల్ల గుండెజబ్బులు, ఊబకాయం వంటి బారిన పడే అవకాశం ఉంటుంది.

కొన్ని సార్లు ప్రాసెస్డ్ మీట్ వాడుతూ ఉంటారు. కానీ ఇది ఎక్కువగా తింటే శరీరానికి మంచిది కాదు. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసిన వంటకాలలో ఎక్కువగా నాన్ వెజ్ వే ఉంటాయి. చికెన్ 65, చికెన్ పకోడా, క్రిస్పీ చికెన్, చికెన్ పాప్ కార్న్, మటన్ కబాబ్, చికెన్ ఫ్రై వంటి వంటకాలను రెస్టారెంట్స్‌లో  కొన్నిసార్లు  పదే పదే వేడి చేసి అందిస్తారు. కానీ వీటివల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అందుకే వీలయినంత వరకూ నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఒకవేళ చికెన్, మటన్ వంటివి తిన్నా కూడా మసాలాలు,  నూనెలు తగ్గించి తినమని సూచిస్తున్నారు. అది కూడా ఒకరోజుకు 170 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని.. అంతకంటే ఎక్కువ మోతాదులో తింటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. సాధ్యమయినంత వరకూ నాన్ వెజ్ కు దూరంగా ఉంటూ పళ్లు, తాజా కూరగాయలు వంటివి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =