అంతా భయపడుతున్నట్లే అయింది. చైనాలో మొదలయిందన్న HMPV వైరస్..భారత్‌లోనూ ఎంటర్ అయింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ ఉందన్న వార్తతో భారతీయులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. దీంతో 2020 ఇలానే చైనా వైరస్‌తో మొదలైంది.. 2025లోనూ ఇదే రిపీట్ అవుతుందని భయపడుతున్నారు.
గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం చైనా నుంచే 2020లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దీనిలోని రకరకాల వేరియంట్లు ప్రపంచం మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. తొలి వేరియంట్ కంటే, రెండో వేరియంట్ ప్రపంచానికి నరకం చూపించి.. లక్షల మంది చనిపోయారు. అప్పుడు చైనా దాదాపు మూడేళ్ల పాటు తమ దేశంలో లాక్ డౌన్ విధించింది. చైనాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు కూడా చైనాలో అదే జరుగుతుందని.. అలాంటి పరిస్థితులే ప్రపంచం మరోసారి చవి చూడాల్సి ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2020 సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో వైరస్‌తోనే స్వాగతం పలికింది. ఆ ఏడాదిలో తొలిసారిగా చైనా దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినట్లుగానే ఇప్పుడు కూడా వైరస్ తోనే మొదలైంది. అంటే ఈ ఏడాది కూడా 2020 లాగే మారుతుందా అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జనవరి ఒకటో తేదీ బుధవారం వచ్చింది. 2025 లో కూడా ఫస్ట్ బుధవారమే పునరావృతమైంది. అప్పుడు కరోనా దేశాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది.
ఇప్పుడు శీతాకాలం కావడంతో కొంతకాలంగా జలుబు, దగ్గుతో చాలామంది బాధపడుతున్నారు. న్యూమోనియాతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ దీనిపై అలర్ట్ ప్రకటించింది. దీనికితోడు ప్రజలంతా కూడా కాస్త అవేర్నెస్ కలిగి ఉండాలని వైద్యులు కోరుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.