ఫాస్టాగ్ చెక్ చేసుకుని సొంతూళ్లకు బయలుదేరండి..

Check Your Fastag And Leave For Your Hometown, Check Your Fastag, Fastag Checking, Fastag, Hometown For Sankranti, National Highway, Sankranti, Sankranti 2025, Sankranti Latest News, 2025 Sankranti, Andhra Pradesh, AP Live Updates, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే సమయం వచ్చేసింది. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టోల్‌గేట్ల వద్ద చాలా రద్దీ ఉంటుంది. ఒకవేళ మీ ఫాస్టాగ్ ఎక్కౌంట్ సరిగ్గా లేకపోతే ముందుకూ వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. టోల్‌గేట్ వద్ద పడిగాపులు తప్పవు. అందుకే ఊరికి వెళ్లే ముందే మీ కారు ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోవాలి.

సంక్రాంతి వచ్చిందంటే చాలు కార్లలో వెళ్లేవారితో రోడ్లపై ట్రాఫిక్ చాలా ఉంటుంది. మీరు కూడా సంక్రాంతికి కార్లో ఊరెళ్తుంటే మీ ఫాస్టాగ్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. కేవైసీ చేయించకపోయినా లేక మినిమం బ్యాలెన్స్ లేకపోయినా బ్లాక్‌లిస్ట్‌లో పడిపోతుంటాయి. సాధారణ సమయం కంటే సంక్రాంతి సమయంలో విజయవాడ-హైదరాబాద్ మధ్య భారీ రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో మీ ఫాస్టాగ్ పనిచేయకపోతే టోల్‌గేట్ దాటి ముందుకెళ్లలేరు. వెనక్కి రాలేని పరిస్థితి ఉంటుంది. దాంతో మీకూ ఇబ్బందే. మీ వల్ల వెనకాల కార్లు నిలిచిపోయి ట్రాఫిక్ పెరిగిపోతుంది. అందుకే ఊరెళ్లే ముందు ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి.

అత్యవసరమైతే 1033 కు ఫోన్ చేస్తే సంబంధిత ఎన్‌హెచ్ఏఐ సిబ్బంది మీ వద్దకు చేరి సహాయం అందిస్తారు. సాధారణ సమయంలో విజయవాడ-హైదరాబాద్ మధ్య టోల్ గేట్ల వద్ద రోజుకు 33-37 వేల వాహనాలు తిరుగుతుంటాయి. సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఇక వీటిలో 100-200 వాహనాలు బ్లాక్ లిస్టులో ఉన్నవే ఉండే ప్రమాదం ఉంది. కొంతమంది సరిగ్గా టోల్‌ప్లాజా వద్దకు వచ్చి రీఛార్జ్ చేస్తుంటారు. అలా చేస్తే యాక్టివేషన్‌కు కనీసం 15-20 నిమిషాల సమయం పడుతుంది.

టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరి ఉంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు, వెంటనే వాహనాల్ని క్లియర్ చేసేందుకు సిబ్బంది మీ కారు వద్దకు వచ్చి ఫాస్టాగ్ స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రతి టోల్‌ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, ఒక స్టిక్ మిషన్ అందుబాటులో ఉంచారు. దాంతో కేవలం 3 సెకన్లలో ఫాస్టాగ్ స్కానింగ్ పూర్తవుతుంది. అయితే మీ ఫాస్టాగ్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవల్సిన బాద్యత మాత్రం మీదే.