నారావారిపల్లెలో చంద్రబాబు: సంక్రాంతి వేడుకలతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి!

Chandrababu In Naravaripalle Festivities And Development Plans Unveiled,AP CM News,Chandrababu Naidu,Lokesh Family,Naravaripalle Development,Sankranti Celebrations,CM Chandrababu Family At Naravaripalle,CM Chandrababu About AP Development,Nara Devansh,Chandrababu Naidu Launches Development Projects In Naravaripalle,AP CM Chandrababu Naidu,CM Chandrababu Naidu,CM Chandrababu Naidu Latest News,CM Chandrababu Naidu News,CM Chandrababu Naidu Live,CM Chandrababu Naidu Family At Sankranti Celebrations In Naravaripalle,CM Chandrababu Naidu Family,Sankranti,Sankranti 2025,CM Chandrababu Naidu Sankranti Celebrations,CM Chandrababu Naidu Sankranti Celebrations In Naravaripalle,CM Chandrababu Naidu Family Sankranti Celebration,AP News,Nara Lokesh,AP,AP Latest News,Andra Pradesh,Mango News Telugu,Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆయన ఇవాళ, రేపు అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి పండుగను జరుపుకోనున్నారు. ఆదివారం నాడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన అమరావతికి తిరిగి వెళ్లనున్నారు.

చంద్రగిరి థియేటర్‌లో లోకేశ్ కుటుంబం:
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇప్పటికే నారావారిపల్లెలో ఉన్నారు. లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఆదివారం నాడు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం లోకేశ్ కుటుంబం శేషాచల లింగేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం కందులవారిపల్లెలో వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. తర్వాత, చంద్రగిరి పట్టణంలోని ఎస్వీ థియేటర్‌కు వెళ్లి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్‌’ సినిమాను కుటుంబసభ్యులతో కలిసి వీక్షించారు.

భోగి శుభాకాంక్షలతో చంద్రబాబు ట్వీట్:
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవిత్రమైన భోగి పండుగ కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ సమస్యలు తీరాలన్నదే మా ప్రధాన లక్ష్యం’’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.