ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

Andhra Praa Andhra Pradesh, Andhra Pradesh Cabinet Key Decisions, Andhra Pradesh Cabinet Key Decisions Details, Andhra Pradesh Cabinet Meet, Andhra Pradesh Cabinet Meet Highlights, Andhra Pradesh Cabinet meet today, Andhra Pradesh cabinet meeting, Andhra Pradesh Cabinet Meeting Highlights, Andhra Pradesh cabinet meeting News, Andhra Pradesh Cabinet meeting Today, AP Cabinet, AP Cabinet Meeting, AP Cabinet Meeting Highlights, Mango Newsdesh Cabinet Key Decisions Details

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జూలై 8న వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహణ. అదేరోజున 100 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్, ఆక్వా ల్యాబ్స్ ప్రారంభం. అలాగే 1898 రైతు భరోసా కేంద్రాల ప్రారంభం. 640 కమ్యూనిటీ హైరింగ్ ఏర్పాటు. 53 నూతన పశు వైద్యశాలల ప్రారంభం, 6 కొత్త రైతు బజార్ల ప్రారంభోత్సవం, 45 రైతు బజార్ల నిర్మాణానికి శంకుస్థాపన.
  • వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి కేబినెట్‌ ఆమోదం.
  • అమ్మ ఒడి నగదు వద్దనుకుంటే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ ల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం. ల్యాప్‌టాప్‌ లకు మూడేళ్ల వారంటీ.
  • ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు.
  • విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను యూనివర్సిటీగా మార్పు చేస్తూ నిర్ణయం.
  • టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణంకు ఆమోదం, అలాగే అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి కేబినెట్ ఆమోదం.
  • జూలై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన.
  • పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌ల ఏర్పాటు.
  • 2021-24 ఐటీ పాలసీకి ఆమోదం.
  • వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఊటుకూరు గ్రామంలో కడకనాథ్ నాటుకోళ్ల హేచరీస్‌ ఏర్పాటు. జూలై 8న శంకుస్థాపన.
  • 2020-25 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
  • రూ.89 కోట్లతో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలు.
  • రాష్ట్రంలో పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =